మహిళ మీద ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ మాట్లాడుతున్నాడని, గత పదేళ్లలో మహిళలను అన్ని రకాలు అణచివేసింది కేసీఆర్ కాదా..? కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంత్రుత్వ పోకడలు పోయింది మీరు కాదా..? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయం సహాయక గ్రూపు లను నిర్వీర్యం చేయ లేదా..? పావలా వడ్డీ రుణాలు ఎత్తి వేసి మహిళలకు అన్యాయం చేయ లేదా…? మహిళల కోసం…
ప్రభుత్వ సర్వజనాసుపత్రుల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చి వీటి పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించేందుకు రెండు నెలల క్రితం రూపొందించిన 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. మూడు గంటల పాటు సాగిన సమీక్షలో అంశాల వారీగా జీజీహెచ్లలో చేపట్టబడిన చర్యలపై వివరాల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో పెట్టుబడులపై ఈ నెల 25 నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్ ఒకటో తేదీ వరకు శాన్ఫ్రాన్సిస్కో నగరంలో లోకేశ్ పర్యటించనున్నారు. ఈ నెల 25 తేదీన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే ఐటీ సినర్జీ కాన్పరెన్సుకు మంత్రి హాజరు కానున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
కేరళ తరహాలో తీర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు, బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది…
Shocking: ఆగ్రాలో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారి అయిన భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్లోని గెస్ట్ హౌజ్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తన భర్త దీనదయాళ్ దీప్తో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని మహిళ సూసైడ్ నోట్లో పేర్కొంది.
మంగళగిరి పోలీస్స్టేషన్ వద్దకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.