నిమ్స్‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి మరో ఘనత నిమ్స్ ఖాతాలో చేరింది. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సర్జరీలు చేశారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. 10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ దవాఖానగా నిమ్స్ హాస్పిటల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకూ 101 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు…
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లోని నబాటీహ్‌లోని మునిసిపాలిటీ భవనాలపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాడిలో కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని.. సహాయక చర్యలు…
మీ శరీరంలో వచ్చిన బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడంతోపాటు డైట్ చేయాలి. బరువు తగ్గడం కోసమని.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్ బ్రెడ్, పాస్తా, తీపి తృణధాన్యాలు, ఐస్ క్రీమ్‌లు మరియు స్వీట్లు, ఫుల్-క్రీమ్ డైరీ ఉత్పత్తులు, సాస్‌లకు దూరంగా ఉండటం ముఖ్యం. ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో పిజ్జా, బర్గర్లు, పేస్ట్రీలు వంటి ఆహారాలు…
దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సదస్సుకు జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి టెలికాం కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు 33 దేశాల కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ దేశాల నుంచి బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారని, అనేక టెలికాం కంపెనీలకు సంబంధించిన సంస్థల…
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు.
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు.…
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు తమ అవసరాల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వే ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఈ వర్గాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రయాణీకుల వర్గం కూడా ఉంది. వీరికి భారతీయ రైల్వే వివిధ సడలింపులను ఇస్తుంది.
తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్ గా రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల…
రాష్ట్ర అభివృద్ధికి ఆరు నూతన పాలసీలు రూపొందించామని.. ఈ నూతన పాలసీలతో ఒక గేమ్ ఛేంజర్‌గా ఏపీ అభివృద్ధి మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఏపీ గ్రీన్ ఎనర్జీ 4.0, టూరిజం, ఐటీ విధానాలలో పాటు అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చారు.
వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అంతేకాకుండా.. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.