హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు.
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అబూజ్ మద్ తో పాటు దండకారణ్యం ప్రాంతాల్లో మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుని పడుతున్నప్పటికీ మరోవైపున మావోయిస్టు పార్టీ తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంది తాజాగా దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమీకరణ అయ్యారు. పలు గ్రామాల గిరిజనుల ను ఒక చోటికి చేర్చి మావోయిస్టు వారోత్సవాలని నిర్వహించారు.. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన రామకృష్ణ తో పాటు డప్పు రమేష్ ,నర్మద…
5 నెలల చంద్రబాబు పాలనలో డీబీటీ ఎక్కడ మచ్చుకైనా కనపడటం లేదని.. డీపీటీ మాత్రమే కనిపిస్తోందని.. డీపీటీ పాలన అంటే దోచుకో పంచుకో తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ 7 కూడా లేదన్నారు. ప్రజలు నిలదీస్తారని భయపడి కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఈ విధానం ఓటాన్ బడ్జెట్ నడుపుతున్న ప్రభుత్వం ఇదేనన్నారు.
వైసీపీ చేయని తప్పులు లేవని.. లేకుంటే ఎందుకు ఎన్నికల్లో 11కు పడిపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నామని.. 93 శాతం సీట్లు వచ్చాయంటే... అందరం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. విదేశాల నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారన్నారు.
ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలోని పడమట రైతుబజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్మెంట్…
అక్టోబర్ 23 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా జరగనుంది. అయితే.. 23వ తేదీన నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ స్వదేశీ మేళాలో 500 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉండనున్నాయి. ప్రతి రోజు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ట్రైనింగ్ అండ్ లెక్చర్ ప్రోగ్ర్సాం ప్రతి రోజూ నిర్వహించనున్నారు. అయితే.. ఈ స్వదేశీ మేళా కోసం..…
ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్లో మండలంలో 10.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. 3.96 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంట సాగులో ఆదిలాబాద్ అగ్రస్థానంలో ఉండగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరుసగా 1.47 లక్షలు, 1.42 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఆదిలాబాద్…
రాష్ట్రంలోని పట్టణాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు.