మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.…
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని…
ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ.. బాల్య వివాహాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలపై మార్గదర్శకాలను జారీ చేసిన కోర్టు, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టం ప్రకారం సంప్రదాయాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. బాల్య వివాహం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును హరిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన…
అమరావతి డ్రోన్ సమ్మిట్పై వివిధ శాఖల సెక్రెటరీలు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22, 23 తేదీలలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది.
ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్యసమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసలు మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం జరిగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV కోసం కొత్త బాస్ ఎడిషన్ను పరిచయం చేసింది. అనేక కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది. డీలర్షిప్ స్థాయిలో యాక్సెసరీస్ ద్వారా ఇన్స్టాల్ చేస్తున్నారు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ పండుగ సీజన్లో మాత్రమే అమ్మకానికి ఉంటుందని తెలుస్తోంది.
రెస్టారెంట్ల పరిస్థితి ఇప్పుడు పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది. బయటకి చూస్తే క్లాసీగా కనిపిస్తున్నా, వంటగది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. భోజన ప్రియుల దృష్టిని దూరంగా ఉంచి, నాలుగు మొక్కలు, కొత్త పంథాలను ఉపయోగించి యాంబియెన్స్ను మెరుగుపరుస్తున్నారు. కస్టమర్లు హోటళ్ల వంటగదిని పరిశీలించరు కనుక, వారు ఏది అందించినా తింటారు అని భావిస్తున్నాయి రెస్టారెంట్ యాజమాన్యాలు. ముఖ్యంగా హైదరాబాద్లో, విభిన్న ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. వీకెండ్ వచ్చేసరికి, ఇంట్లో వండడం కన్నా రెస్టారెంట్ల…
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్…
అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుండి 31 వరకు పదిరోజులు సంస్మరణ దినోత్సవాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.