భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ తన మాజీ సహచరుడు, దిగ్గజ భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. జహీర్‌ఖాన్ ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ కంటే మెరుగైనవాడని చెప్పాడు.
ఫైర్ బోల్ట్ యొక్క స్మార్ట్ వాచ్ ధర రూ. 2 వేల 499. ఈ వాచ్ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. మీరు ఈ వాచ్ ను ముదురు గ్రే, నలుపు, పింక్ మరియు గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫైర్ బోల్ట్ అపోలో 2 ఫీచర్లు విషయానికొస్తే.. తక్కువ బడ్జెట్ కస్టమర్ల కోసం లాంచ్ చేసిన ఈ వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే లభిస్తుంది. అంతేకాకుండా వృత్తాకార డయల్‌తో మెటాలిక్ బాడీ…
నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సెజ్ లో 500 రూపాయల నోటును తీసుకోవద్దని, అందులో ఆకుపచ్చ స్ట్రిప్‌ను ఆర్బిఐ గవర్నర్ సంతకం దగ్గర కాకుండా గాంధీజీ చిత్రం దగ్గర ఉంచాలని పేర్కొంది. అయితే ఆ మెసేజ్ వైరల్ కావడంతో జనాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఈ విషయం పూర్తిగా ఫేక్ అని తేలింది.
రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై 'ఓట్ ఇండియా - సేవ్ డెమోక్రసీ' పేరుతో లోక్‌సత్తా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలోని మయూరా హోటల్ కాన్ఫిరెన్స్ హాల్లో పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పోస్టర్ ఆవిష్కరించారు.
4వ తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. గురువుగారి నిర్వాకం అంతా సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 30 నిమిషాల్లో ఉపాధ్యాయుడు 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయితే వచ్చే వారమే గురువుగారి వివాహం జరగనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటి భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు సాయుధ పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా దళాలు కాల్చిచంపాయని ఆర్మీ శనివారం తెలిపింది.