పెరుగుతున్న పప్పుల ధరలు. బ్రేక్ వేయనున్న కేంద్రం..!
పెరుగుతున్న పప్పుల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గోధుమల వంటి బఫర్ స్టాక్ నుండి పప్పులను విక్రయించనుంది. దీంతో మార్కెట్‌లోకి కందిపప్పు రానుండటంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కందిపప్పు ఢిల్లీలో చాలా ఖరీదుగా ఉంది. అక్కడి ప్రజలు కిలో పప్పును 160 నుంచి 170 రూపాయలకు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెసరపప్పును వేలం ద్వారా మార్కెట్‌లో విక్రయించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆహార మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అవి ఆన్‌లైన్ వేలం ద్వారా మిల్లు యజమానులకు పప్పులను విక్రయించనున్నాయి. తద్వారా మార్కెట్‌లో కంది పప్పుల నిల్వను పెంచవచ్చు.
ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్న బాలయ్య ఫ్యాన్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్బంగాఈ సినిమాకే ”భగవంత్ కే సరి”అనే టైటిల్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన తర్వాత బాలయ్యకు మరో భారీ హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు . అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.. అనిల్ రావిపూడి ఈ సినిమా ను బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం.
ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్న బాలయ్య ఫ్యాన్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్బంగాఈ సినిమాకే ”భగవంత్ కే సరి”అనే టైటిల్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన తర్వాత బాలయ్యకు మరో భారీ హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు . అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.. అనిల్ రావిపూడి ఈ సినిమా ను బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం.
యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఒకే దేశంలో 2 చట్టాలపై నడవదు..
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు. బీజేపీ పార్టీ ‘మేరా బూత్ సబ్సే మజ్‌బూత్’ ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, యూనిఫాం సివిల్ కోడ్ పై వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైంది
ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగిందన్నారు. 120 రోజుల్లో జరిగే ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి.. కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ను ఎలా ఓడించాలని, బీజేపీనీ ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు.
హోటల్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి
చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రావడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి పెరంబూర్ లోని హైదర్ గార్డెన్‌లో నిపసించే అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డా.రాధాకృష్ణన్ సలైలో ఉన్న హోటల్‌లో జూన్ 25న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అభిషేక్ తన పనిని ముగించుకుని హోటల్ తొమ్మిదో అంతస్తు నుంది కిందికి దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. లిఫ్ట్ 8వ అంతస్తుపైకి వెళ్తుండగా తన వెంట తీసుకెళ్తున్న ట్రాలీ.. లిఫ్టు డోరులో ఇరుక్కుపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నడి సముద్రంలో నారాయణుడి విగ్రహం.. షాక్ లో మత్స్యకారులు
సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన మత్స్యకారులకు విష్ణుమూర్తి దర్శమిచ్చాడు. శంఖు, చక్రాలతో నారాయణుడి విగ్రహం మత్స్యకారులకు దొరికింది. పుదుచ్చేరిలో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు శంఖు, చక్రాలు ధరించిన శ్రీమన్నారాయణుడి ప్రతిభ లభ్యమైంది. ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లు తన్మయత్వం చెంది భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించారు. నారాయణుడి విగ్రహం దొరకటం మా అదష్ణం అని మత్స్యకారులు మురిసిపోతున్నారు. ఆ తరువాత పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సముద్ర తీరానికి చేరుకున్న అధికారులు వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దారుణం.. ఆ అనుమానంతో భార్యను రాడ్డుతో కొట్టి చంపిన భర్త..
అనుమానం పెను భూతం అని పెద్దలు ఊరికే అనలేదు.. ఒక్కసారి కలిగితే ఎవరొకరి ప్రాణం పొయ్యేవరకు ఆగదు.. ఇక కుటుంబ కలహాల వల్ల ఎందరో భార్య భార్యలు ప్రాణాలను తీసుకున్నారు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.. కుటుంబంలో గొడవలు రావడంతో ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు.. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లో వెలుగు చూసింది.. బద్లాపూర్ ప్రాంతంలోని మంజర్లిలో ని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగింది..
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని థానే జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. బద్లాపూర్ ప్రాంతం లోని మంజర్లిలోని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడికి, అతని 37 ఏళ్ల భార్య కు కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు జరిగేవని, ఆమె వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాడని అందుకే ఆమెను చంపినట్లు పోలీసులు తెలిపారు..
కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి 4 లక్షలు స్వాహా చేశారు..
కస్టమ్స్ అధికారులమని చెప్పి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు ఆగంతకులు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి 4.15 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్ సులేమాన్‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మొహమ్మద్ సులేమాన్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించుకునే సామాన్యుడు. చాలాకాలం తర్వాత భారత్ వచ్చిన సులేమాన్‌ను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు.
48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
గత 48 గంటల్లో బంగారం ధర రూ.58,400 నుంచి రూ.58,300కి తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం విపరీతంగా పెరిగింది. దీనికి కారణం అమెరికా యొక్క PMI గణాంకాలు మరియు రష్యాలో పెరుగుతున్న అస్థిరత అని అంటున్నారు. అయితే ఈ రెండు దేశాలు వెండి ధరను పెంచేంత పెద్దవి కావు. మరోవైపు మెక్సికో మరియు పెరూ వంటి దేశాల నుండి వచ్చిన నివేదికలు వెండి ధరలు మళ్లీ ఆకాశాన్నంటేలా ఉన్నాయి. గత 48 గంటల్లో వెండి ధర రూ.2300 పెరిగింది. అయితే పెరూ మరియు మెక్సికో నుండి ఎలాంటి నివేదికలు వచ్చాయో.. వెండి ధర పెరుగుదలకు కారణాలు తెలుసుకుందాం.
తప్పు చేశాను.. అలా చేయకుండా ఉంటే బావుండేది
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దశరథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషం, సంబరం,శ్రీ, స్వాగతం,మిస్టర్ పర్ పెక్ట్, గ్రీకువీరుడు,శౌర్య లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే దశరథ్ కొన్నేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఒక తాజా ఇంటర్వ్యూలులో తన కెరీర్ గురించి, గతం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మొదట దశరథ్ రచయిత. ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించాడు. చాలామంది డైరెక్టర్ల వద్ద పనిచేశాడు. అయితే డైరెక్టర్ అవ్వాలనే కోరికతో రైటింగ్ మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆ సమయంలో రైటర్ గా కూడా పనిచేసి ఉంటే .. ఇప్పుడు తన పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పుకొచ్చాడు.
చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
చంద్రబాబుకు దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. చంద్రబాబు ఒక దళిత ద్రోహి అని, సీఎంగా ఉన్నప్పుడూ ఏనాడైనా దళితుల్ని పట్టించుకున్నారా? అని నిలదీశారు. దళితులపై దాడులు జరిగితే ఖండించేది, చర్యలు తీసుకునేది ఒక్క సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును అమలు చేస్తే.. మొదటి కేసు చంద్రబాబుపైనే పెట్టాలని చెప్పారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా..? అని తమను అవమానించాడని గుర్తు చేశారు.