ఈటల రాజేందర్ ఆయన సతీమణి అనేక అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ బీఆర్ఎస్‌ఎల్పీ ఆఫీస్ లో ఎమ్యెల్సీ కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నేను అమరవీరుల స్థూపాన్ని కూలగొట్టించానని అబద్ధాలు చెప్తున్నారని, రోడ్ వైండింగ్ కింద మున్సిపాలిటీ వారే దాన్ని కూలగొట్టారని ఆయన వెల్లడించారు. స్థూపంపై ఈటల పేరుందని నేనే కూల్చేపించానని అంటున్నారని, అసలు స్థూపానికి శిలాఫలకం లేనే లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన రోజు ఈటల ఎక్కడ పడుకున్నాడు.? 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పుడు ఈటల ఎక్కడున్నాడు.? అని ఆయన ప్రశ్నించారు. మా నియోజకవర్గంలో పాత కమలాపూర్ లో మా ఇంట్లో మా నాన్న సమక్షంలో పార్టీ జెండా పుట్టిందని, మా నాన్న టీఆర్ఎస్ లో పని చేస్తున్నప్పుడు నువ్వెక్కడ ఈటల.? అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Triple Talaq: ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన ఇస్లామిక్ దేశాలు ఇవే..
2004లో ఎమ్యెల్యే అవ్వడానికి మాత్రమే ఈటల టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడని, నేను ఆయనని 20కోట్లిచ్చి చంపిస్తానని అంటున్నారు.. ఇంత కంటే పెద్ద అబద్ధం ఇంకొక్కటి లేదని ఆయన అన్నారు. హత్య రాజకీయాలు చేసేది నువ్వని, వీణవంక మండలం నర్సింగరావు గ్రామంలో ఉన్న ఎంపీటీసీ బాలరాజ్ ని నువ్వు మర్డర్ చేయించావా లేదా.? దీనికి జవాబు చెప్పు.? అని ఆయన అన్నారు. ప్రవీణ్ యాదవ్ ని, సంపత్ థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టించి చంపించావ్ అని ఆయన అన్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉంది ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించావు.. 2018లో మర్రిపెల్లి గూడెంలో నన్ను చంపించే ప్రయత్నం చేసావు.. నాకే భయం ఉంది.. నన్ను ఈటల చంపించడానికి ప్రయత్నిస్తాడు అనే అనుమానం ఉంది’ అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Pulses Price Hike: పెరుగుతున్న పప్పుల ధరలు. బ్రేక్ వేయనున్న కేంద్రం..!