రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్ధి మూత్ర విసర్జన కేసులో నిందితుడు ప్రవేశ్ శుక్లా నివాసాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ సర్కారు కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో ప్రస్తుతం ఇంధన ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులకు మోత మోగిస్తుంటే.. మరోవైపు ఈ పెట్రోల్ రేట్లు కూడా వాహనదారులకు గుదిబండగా మారాయి.
నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వర్షాకాలంలో మారుతున్న వాతావరణం వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆహారం, పానీయాల విషయంలో చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 17.01 సెల్సియస్కు చేరుకుందని వెల్లడించింది.
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల అన్ని హోటళ్లు, లాడ్జీలలో అతిధుల డ్రైవర్లకు టాయిలెట్లు, బాత్రూమ్లతో వసతి కల్పించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు వర్గాల న్యాయవాదుల మధ్య ఏదో సమస్యపై వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత వారు గాలిలోకి కాల్పులు జరిపారని కనుగొన్నారు.
ఈరోజుల్లో నిద్రలేమి సమస్య ప్రజల్లో పెరిగిపోతోంది. దీంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. మానసిక సమస్యల వల్ల లేదా రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు వల్ల నిద్రలేమి వస్తుందని తరచుగా నమ్ముతారు, అయితే శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని మీకు తెలుసా.
విడిపోయిన తర్వాత ప్రేమలో ఉందని భావించాడు ఆ ప్రియుడు. కానీ ఆ ప్రియురాలి చేసిన పనికి ప్రియుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయాడు. ప్రేమ పేరుతో కొన్ని సంవత్సరాలుగా అతడ్ని వాడుకున్న ఆ మహిళ.. చివరికి ఒంటిమీది బంగారం, బట్టలు కూడా లాగేసుకుని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లింది.