ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు సర్వసాధారణమైపోయాయి. 10 మంది యువకులలో ఒకరు ఖచ్చితంగా ఈ బాధను అనుభవిస్తున్నారు. అయితే మీరు ఇంటి చిట్కాలతో కిడ్నీలో రాళ్లను వదిలించుకోవచ్చు. అయితే కిడ్నీలో రాళ్లు చేరడం అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ సమస్య 10 శాతం మందిని తమ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రభావితం చేస్తోందని అంచనా. కిడ్నీ స్టోన్స్ విషయంలో సకాలంలో స్పందిస్తే ఆ సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది. అయితే కిడ్నీలో రాళ్లను పోగొట్టేందుకు ఇంటి చిట్కాల నుండి ఉపశమనం పొందచ్చు.. అయితే దాన్ని తయారుచేసే విధానం తెలుసుకుందాం.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. మనీష్ సిసోడియా, ఇతరుల ఆస్తులు స్వాధీనం
ఒక కప్పు కొబ్బరి నీరు, నిమ్మరసం, 1 నుండి 4 దోసకాయ ముక్కలు, తురిమిన అల్లం తీసుకోవాలి. వాటన్నింటీని గ్రైండర్‌లో వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత గ్లాసులో తీసుకొని తాగాలి. రోజూ ఈ డ్రింక్ తాగితే త్వరలోనే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఈ రెమిడీని తయారు చేసుకోకలేకపోతే.. కనీసం కొబ్బరి నీరు, వాటర్ తీసుకోవచ్చు. రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
Ratan Tata: వానాకాలంలో డ్రైవింగ్ చేసేవారు జర దీని గురించి తెలుసుకోండి..
అయితే కొబ్బరి నీళ్లలో పోషకాల వల్ల ఈ సమస్యకు బాగా ఉపయోగం కలుగుతుందని డాక్టర్లు అంటున్నారు. కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర, డైటరీ ఫైబర్, ప్రోటీన్, థయామిన్ (విటమిన్ B1), రిబోఫ్లావిన్ (విటమిన్ B2), నియాసిన్ (విటమిన్ B3) విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ప్రోటీన్స్ ఉండటం వల్ల మంచిగా పనిచేస్తుందని అంటున్నారు.