హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసి డిమాండ్లకు తరలిస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లక్ష్యనాయక్ తాండ కు చెందిన విట్టల్ హత్యను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందుతులు ప్రయత్నించారు. అయితే.. ఈ విఠల్ మరణంపై అనుమానం ఉండటంతో
రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను పెంచడం, పౌరులకు ఏకకాలంలో మరిన్ని వినోద ప్రదేశాలను అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంతో GHMC నగరంలోని వివిధ ప్రాంతాల్లో థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. అయితే.. ఈ క్రమంలోనే.. ఒకప్పుడు చుట్టూ మురికి, చెత్తాచెదారంతో ఉండే ఈ చిన్న ల్యాండ్ ఇప్పుడు
తోటి వ్యాపారులపైనే దాష్టీకానికి పాల్పడ్డారు. బకాయిలు అడిగినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. విచక్షణ మరిచి.. బట్టలు ఊడదీసి కొట్టారు. ఆపై వీడియోలు రికార్డు చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మొగల్తూరు మండలం మొళ్లపర్రు గ్రామంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.