Kevin Spacey: ఆస్కార్-విజేత, అమెరికన్ నటుడు కెవిన్ స్పేసీ ప్రస్తుతం లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బుధవారం లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్ట్‌కు ఆయన హాజరయ్యారు. నలుగురు పురుషులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించిన బాధితులలో ఓ వ్యక్తి తన పట్ల కెవిన్ స్పేసీ దూకుడుగా ప్రవర్తించాడని పేర్కొన్నాడు.
గురువారం లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో భాగంగా స్పేసీ ప్రవర్తను గురించి వివరించిన ఓ బాధితుడు..‘ఓ సారి వెస్ట్ ఎండ్ థియేటర్‌లో మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన స్పేసీ.. నా మర్మాంగాన్ని బలంగా పట్టుకున్నాడు. నొప్పిని కలిగించేంత శక్తితో నొక్కుతూ కోబ్రాలాగే ఉందంటూ నీచంగా మాట్లాడాడు. నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో నటుడి చేతిని దూరంగా నెట్టాను. దీంతో స్పేసీ నవ్వుతూ మరింత రెచ్చిపోయాడు. దూకుడుగా నా అంగాన్ని పట్టుకుని వాంఛ తీర్చుకోవడానికి క్రూరంగా ప్రవర్తించాడు. ఈ నీచమైన చర్య గురించి నేను ఇంకేమీ చెప్పలేను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అన్నాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read: Chhattisgarh: రూ.7,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
సోమవారం రోజున కోర్టులో మాట్లాడిన మొదటి బాధితుడు.. స్పేసీ తన బట్టలను లాగేసి తన ప్రైవేట్ భాగాలను పట్టుకున్నట్లు ఆరోపించాడు. “స్పేసీ గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది.” అని చెప్పాడు. స్పేసీ అన్ని ఆరోపణలను ఖండించారు. ప్రాసిక్యూటర్ క్రిస్టీన్ ఆగ్న్యూ స్పేసీపై ఆరోపించబడిన అనేక ఆరోపణలను వివరించడం ద్వారా కోర్టులో విచారణను గురువారం ప్రారంభించారు. ఆగ్న్యూ కోర్టుకు ఇలా చెప్పారు. “అతను చాలా ప్రసిద్ధ నటుడు, అతను అనేక అవార్డులను గెలుచుకున్నాడు. అతను ఇతర పురుషులపై లైంగికంగా దాడి చేసే వ్యక్తి” అని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 63 ఏళ్ల నటుడు నలుగురిపై లైంగిక నేరాలకు సంబంధించి మొత్తం 12 ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. 2001- 2013 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.