గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం వల్ల ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 2019-21 మధ్య 26వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైతే.. 23 వేల మంది తిరిగొచ్చారని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భూమన భేటీ అయ్యారు. వచ్చే నెల 12తో టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి బాగా పెరుగుతోంది. గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
చంద్రబాబు రోజూ గంట సేపు ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఉన్నారని.. జగన్ రాయలసీమ ద్రోహి అని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారంలో నుంచి దింపకపోతే రాయలసీమను రత్నాల సీమగా మార్చేవాడట చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వివేకా కేసు తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
బిగ్బాస్ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్షిప్ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది.