బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను కిషన్ రెడ్డి సందర్శిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రాంతంలో ముంపుబాధితులను కలుస్తారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రంగంపేట, భద్రకాళి చెరువు కట్టను తదితర ప్రాంతాలలో వరద నీటి బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాశీబుగ్గ ప్రాంతంలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పర్యటిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు కొలంబో మెడికల్ కాలేజ్ ప్రాంతంలోని బి ఆర్ నగర్ వివిధ ప్రాంతాలలో వరద నీటిలో మునిగిన, నష్టపోయిన ప్రాంతాలను పర్యటిస్తారు. వివిధ ప్రాంతాలలో నష్టపోయిన వారిని పరామర్శించడం, వరద నష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులకు అండగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నారు.
Also Read : Rain Effect : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మోరంచపల్లి
ఇవాళ.. హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్‌పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలను చురుగ్గా ఎదుర్కోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
Also Read : CM KCR : నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ