వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. చెరువు గండితో ప్రమాదం లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. పడ్డ గండి చిన్నదే… గండి పడ్డ ప్రదేశం నుంచి వెళ్లే నీళ్లు నాలా ద్వారా బయటికి పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండిని పూడ్చామని, శాశ్వతంగా కట్టను బందోబస్తుగా నిర్మించేందుకు 150 కోట్లు తో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. త్వరలోనే పనులు చేపట్టి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
Also Read : Pakistan: పాక్ యువకుడిని పెళ్లాడిన అంజుకి ఖరీదైన బహుమతులు.. ఏం ఇచ్చారంటే..!
అయితే.. భద్రకాళి చెరువు గండిని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు గండిని కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. చెరువు కట్ట గండితో ప్రమాదం లేదని, పోతననగర్ వైపు నాళా వద్ద కట్ట కోతకు గురైందన్నారు. వెంటనే ఇసుక బస్తాలతో గండిని పూడ్చే చర్యలు చేపట్టామన్నారు. ఎవ్వరు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. చెరువు శిఖం కబ్జాకు గురికావడంతో వరద పోటెత్తి గండి పడిందన్నారు. వినయ్ భాస్కర్. అక్రమ నిర్మాణాలను కబ్జాలను తొలగిస్తామని వినయ్ భాస్కర్ అన్నారు.
Also Read : Explosion: బాణాసంచా గోదాంలో పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు