ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు.
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గత 24 గంటల్లో వర్షాలు దంచికొట్టాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారతదేశం తన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్‌తో ఈరోజు చంద్రునిపై కలలకు దగ్గరగా చేరుకుంది. వచ్చే బుధవారం చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్‌కు ముందు కీలకమైన విన్యాసాన్ని ప్రదర్శించింది. చంద్రయాన్ మిషన్ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం పురోగమిస్తోంది. గురువారం చంద్రయాన్-3 మిషన్ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా వేరు చేయబడిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పరిధిలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించనుంది. ఈ డ్రోన్ల సహాయంతో వర్క్‌సైట్‌లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించనుంది.
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సీఆర్పీఎఫ్లోని జంగిల్ వార్ఫేర్ యూనిట్ కోబ్రా(కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఇన్స్పెక్టర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అరారియా జిల్లాలో స్థానిక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు ఈ రోజు ఉదయం అతని ఇంటి వద్ద కాల్చి చంపినట్లు బీహార్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాణిగంజ్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.