బీబీనగర్, భువనగిరి చెరువులకు కొత్త అందాలతో ఆకర్షణీయంగా మారబోతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం సందర్శనకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న బీబీనగర్, భువనగిరి(పెద్ద చెరువు) చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కి అప్పగించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకు ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్, అర్బన్ ఫారెస్ట్ అధికారులు దాదాపు రూ.17 కోట్ల వ్యయంతో బీబీనగర్, భువనగిరి చెరువుల బ్యూటిఫికేషన్ పనులను హెచ్ఎండీఏ నిర్వహించనున్నది.
Pakistan: పాక్‌లో మరణ మృదంగం.. వేర్వేరు ఘటనల్లో 29 మంది మృతి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వరంగల్ నేషనల్ హైవే(NH-65) ఘట్ కేసర్ నుంచి ఆలేరు వరకు జాతీయ రహదారి అంతా హెచ్ఎండీఏ గ్రీనరీని అభివృద్ధి చేసిన సంగతి తెలిసింది. హైదరాబాద్ లో జంటనగరాలను కలిపి ట్యాంక్ బండ్ తరహాలో బీబీనగర్, భువనగిరి చెరువుల ట్యాంక్ బండ్ లను ప్రతిష్టపరచడంతో పాటు వాటిపై పచ్చని అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే విధంగా పలు రకాల పూలమొక్కలు, బొమ్మలు పిల్లల కోసం ఆటపరికరాలు, పాదచారుల కోసం వాక్ వేస్(నడకదారులు), యువతీ యువకుల కోసం జిమ్ పరికరాలను (జిమ్ ఎక్విప్ మెంట్), సందర్శకులు సేదతీరేందుకు బెంచీలు, చెరువు అందాలను వీక్షించేందుకు వ్యూ పాయింట్స్ వంటివి హెచ్ఎండీఏ ఏర్పాటు చేయనున్నది.
Ariyana Glory : కిర్రాక్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
బీబీనగర్, భువనగిరి చెరువుల పరిసరాలలో వీధి దీపాల ఏర్పాట్లు, ఇప్పటికే ఆ చెరువుల పరిసరాల్లో ఉన్న స్మశానవాటికలు, దోబీ ఘాట్ వద్ద వాటికి అవసరమైన ప్రహరీగోడల నిర్మాణాలు హెచ్ఎండీఏ పూర్తి చేయనున్నది. సోమవారం(21వ తేదీన) హెచ్ఎండీఏ చేపట్టనున్న పనులకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.