Viral Video: విమానంలో నెమలితో కనిపించిన అమ్మాయి.. ఎలా తీసుకొచ్చిందంటూ సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది జనాలు జంతువులు లేదా పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మాములుగా అయితే కుక్కలను చాలా మంది పెంచుకోవడం చూస్తుంటాం. మరికొందరు పిల్లులను పెంచుకోవడం చూస్తుంటాం. కాని వెరైటీగా ఓ మహిళ నెమలిని పెంచుకుంటుంది. నెమలిని పెంచుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోకండి. మీరు వింటున్నది నిజమే.. అంతేకాకుండా ఆ నెమలితో విమానం కూడా ఎక్కింది. ఫైట్ లో అమ్మాయి నెమలిని పట్టుకుని కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాములుగా అయితే కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులను యజమానులు తమతో పాటు ఊర్లకు తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఈ వీడియోలో నెమలిని తనతో పాటు విమానం ఎక్కించింది.
Read Also: Samantha: మరోసారి ప్రేమలో పడిన సామ్.. ఈసారి ఆంక్షలు కూడా
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది తాము చూస్తున్నది నిజమేనా.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరొక వ్యక్తి.. నెమలితో ప్రేమ, ఇష్టం ఉండటం మంచిదే కానీ.. ఫ్లైట్‌లోకి ఎలా తీసుకెళ్లిందంటూ రాసుకొచ్చాడు. నెమలిని తీసుకెళ్తుంటే.. విమానంలోని సిబ్బంది మహిళను అడ్డుకోలేదా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.
Read Also: Chithha: చిత్తాగా వస్తున్న సిద్దార్థ్.. ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే
ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు. ఈ వీడియోలో ఓ మహిళ ఒడిలో నెమలి హాయిగా కూర్చున్నట్లు చూడవచ్చు. అంతేకాకుండా నెమలిని ఫ్లైట్‌లోకి తీసుకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆ నెమలి కూడా అటూ ఇటూ చూస్తోంది. దానికి పొడవాటి రెక్కలు ఉన్నాయి. అయితే ఈ నెమలి విమాన ప్రయాణంలో ఎలాంటి వివాదాలు జరగకూడదని మనం కూడా కోరుకుందాం. వాస్తవానికి జంతువులకు సంబంధించి విమానంలో ప్రయాణం ఉంటుందని తెలుసు కానీ.. పక్షులను కూడా అనుమతిస్తారా..!
There's actually no way pic.twitter.com/lWV3q5fYsJ
— Crazy Clips (@crazyclipsonly) August 15, 2023
- Tags
- Peacock
- plane
- telugu news
- viral
- Woman
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..