జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు.
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న తరుణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేరళలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో పందులను చంపాలని ఆదేశించారు.
డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెయ్యేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని, తన దేశం కోసం జైలు శిక్షను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ఓ నివేదికలో పేర్కొంది.
కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.
స్పైస్‌జెట్ ఫ్లైట్ ప్యాసింజర్ విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేస్తే, కొన్నిసార్లు ఇద్దరు ప్రయాణికులు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన అకృత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్... అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భాగల్పూర్లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.
దోమల బారినుండి రక్షించుకోవడానికి మార్కెట్లో వాటి నిర్మూలనకు ఎన్నో వస్తువులు ఉన్నాయి. దోమల బ్యాట్, క్రీములు, ఇతర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తికి తన కాలు మీద దోమ కుడుతుందని ఏకంగా ఓ సుత్తితో కొట్టాడు. దెబ్బకు దోమ సచ్చింది.. బొక్క ఎరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.