వన్డే వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఇదే..!
వన్డే వరల్డ్ కప్-2023కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి ఆగ్రశ్రేణి టీమ్స్ ఇప్పటికే తమ ప్రిలిమనరీ టీమ్స్ ను కూడా ప్రకటించాయి. మరోవైపు భారత జట్టు కూడా వరల్డ్‌కప్ వైపు అడుగులు వేస్తోంది.
ఈ మెగా టోర్నీకి ముందు ఆసియాకప్‌లో టీమిండియా ఆడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్‌కు 17 మంది ప్లేయర్స్ తో కూడిన టీమ్ ను అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టునే వరల్డ్‌కప్‌కు కూడా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇందులో 15 మంది సభ్యులను ఖారారు చేసి సెప్టెంబర్ 15లోపు ఐసీసీకి బీసీసీఐ టీమిండియా జట్టు వివరాలను సమర్పించనుంది. కాగా, ఈ మెగా టోర్నీతో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యారు కూడా బరిలోకి దిగుతున్నారు.
నితిన్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాగా నిలిచిన ‘వకీల్ సాబ్’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. పింక్ సినిమాలో లేని హీరోయిజం పవన్ కళ్యాణ్ కోసం తెచ్చి, దాన్ని పర్ఫెక్ట్ గా కథతో బాలన్స్ చేసాడు వేణు శ్రీరామ్. ఈ కారణంగా వేణు శ్రీరామ్ కి తెలుగులో విసరగా ఆఫర్స్ వచ్చేస్తాయని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ మూవీ కూడా ఆగిపోయింది. దీంతో వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ కి బాగా గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వకీల్ సాబ్ సినిమా ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు, మరోసారి వేణు శ్రీరామ్ కి ఛాన్స్ ఇచ్చాడు.
దిల్ రాజు, వేణు శ్రీ రామ్ కాంబినేషన్ లోకి హీరోగా నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఐకాన్ కథ కథ కాకుండా కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన నితిన్, వేణు శ్రీరామ్ తో చేస్తున్న సినిమాకి ‘తమ్ముడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేసాడు. తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల్లో ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి టైటిల్ తో నితిన్ సినిమా చేసి ఎలాంటి హిట్ కొడతాడు అనేది చూడాలి.
సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని మృతి కేసు…
విశాఖపట్నంలో ఇటీవల అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీసాహా కేసు సంచలనం రేపుతోంది. రితీసాహా మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు త్వరలో నగరానికి రానున్నట్టు సమాచారం. రేపో, ఎల్లుడో దీనిపై స్పష్టతరానుంది. వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసు పై మమతా బెనర్జీ ప్రభుత్వం సీరియస్ ఉంది. గత నెల 14వ తేదీన భవనం పై నుంచి కింద పడి రితీసాహా మృతి చెందింది. విశాఖ పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన బాలిక తల్లి దండ్రులు. ఫోర్త్ టౌన్ పోలీసులు కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకున్నారు అని ఆరోపించారు రితీసాహా తల్లిదండ్రులు.
తిరుపతి నగరవాసుల దశాబ్దాల నాటి సమస్య ఎట్టకేలకు పరిష్కారం
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని 17 ప్రాంతాలను నిషేదిత జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో వాటర్ కోర్స్ పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, ఎరుకల కాలనీ, జర్నలిస్ట్ కాలనీ ,కెనడి నగర్, భగత్ సింగ్ కాలనీ , సుందరయ్య నగర్, శారదా నగర్, సూరయ్య కట్ట, చెన్నారెడ్డి కాలనీ, సంజీవయ్య నగర్, సింగాల గుంట, నరసింహ తీర్థం రోడ్డు, తాతయ్య గుంట, బొమ్మగుంట ప్రాంతాల్లోని స్థలాలను నిషేధిత జాబితా 22(ఎ) లో చేర్చారు. దీంతో తిరుపతి అర్బన్ పరిధిలోని 17 ప్రాంతాల్లోని 104 ఎకరాల పరిధిలో. 5 వేల నివాసాలకు పైగా తీవ్ర ప్రభావం పడింది. ఇవేవీ 60 ఏళ్లకు పైగా రిజిస్ట్రేషన్ సౌకర్యానికి నోచుకోలేదు. దీంతో కళ్ల ముందే ఆస్తులున్నా అవసరానికి వాడుకోలేని దయనీయ స్థితి. తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయించాలని కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ 17 ప్రాంతాల్లోని ప్రజలు కాళ్లరిగేలా తిరుతున్నారు.
అమ్మాయిల కోసమే పైలెట్ అవతారం.. పలువురిని మోసం చేసిన యువకుడు
ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఎక్కువై పోయింది. పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ యువతులను చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అతనిపై అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. అతనంతట అతనే పోలీసులకు చిక్కడంతో విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
వివరాళ్లోకి వెళ్తే గుజరాత్ కు చెందిన రక్షిత్ మంగేలా అనే 20 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్ పోర్ట్ లో అధికారులకు చిక్కాడు. పైలెట్ డ్రస్ లో ఎయిర్ పోర్ట్ లో వెళుతుండగా బోర్డింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి విచారించారు. దాంతో తాను ఎయిర్ ఇండియా పైలెట్ ను అంటూ అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
విమర్శలకు భయపడేవాడిని కాదు
విమర్శలకు భయపడేవాడిని కాదని, నేను నాస్తికుడిననే విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానమన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని ఆయన అన్నారు. దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే అని ఆయన వెల్లడించారు. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది నేనే అని భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు.