నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం ఎందుకివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, mp arvind, mlc kavitha
కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా.. అతని నుండి కొకైన్, హెరాయిన్ ను పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ విలువ రూ. 44 కోట్ల విలువ ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
Eating While Standing: ప్రస్తుతం ప్రజా జీవనం మొత్తం ఉరుకుల పరుగులమయం అయింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక్క జాబుతో బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు రెండో జాబ్ చేయాల్సి వస్తోంది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి.
భార్యను కొట్టే, హింసించే హక్కు భర్తకు ఏ చట్టం ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. క్రూరత్వం, పురుషుడు విడిచిపెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో కరుణ్ నాయర్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా నాయర్ కొనసాగుతుండగా.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
కరెంటు కోతలపై రాజస్థాన్‌లోని బూండీ జిల్లాలో సోమవారం తీవ్ర దుమారం చెలరేగింది. కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లను మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు, రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య స్థాయిలో సంబంధాలపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. దానికి కారణమేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గీతిక శ్రీవాస్తవ పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.