మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన వెలుగు చూసింది. ఉమ్డి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో ఆస్పత్రి పాలయ్యారు.
యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యతో పోరాడుతోంది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఉదయం 8.05 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇచ్చింది.
ఆగస్టు 31న ముంబయిలో ప్రతిపక్ష 'ఇండియా కూటమి' మూడో సమావేశం జరగనుంది. ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన భారత కూటమి.. మూడో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. సీట్ల పంపకాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.
పొలార్డ్ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌ను ఓ ఆట ఆడుకున్నాడు పొలార్డ్. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లో లఖింపూర్ ఖేరీలోని ఫన్ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.
విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు.
పల్లీలు తినడం అంటే చాలామందికే ఇష్టం. ఎవరో కొందరు తినకపోవచ్చు కానీ.. చట్నీలు, స్వీట్స్ కు ఎక్కువగా వాడుతుంటారు. టిఫిన్స్ లో పల్లీ చట్నీ అంటే లొట్టలేసుకుని తింటారు. అయితే పల్లీలను రోజూ తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.