హైదరాబాద్‌లో హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దుం భవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చడా వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. breaking news, latest news, telugu news, big news, Kunamneni Sambasiva Rao, chada venkatreddy
మట్టితో చేసిన విగ్రహాలను వాడడం ఉత్తమం. మరి మట్టి విగ్రహాలు దొరకని వాళ్ళు మరియు వినాయకుని విగ్రహాన్ని తాయారు చేసి పూజించాలి అనుకునేవాళ్లు ఇంట్లో ఉండే వస్తువులతోనే సులువుగా వినాయకుని విగ్రహాన్ని తాయారు చెయ్యవచ్చు. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం
టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు.
ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు.
రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంత్ కుబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం, ఇతర రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడినందు వల్లే సీఐడీ అరెస్ట్ చేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో తట్టుకోలేని టీడేపీ నేతలు ప్రభుత్వాన్ని, న్యాయవాదులను, న్యాయమూర్తులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.