Vinayaka Chavithi: ఇంట్లో ఉండే వస్తువులతో వినాయకుని విగ్రహం తయారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు వినాయక చవితి. ఇప్పటికే ప్రతి చోట వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. కానీ వీటిలో మట్టితో చేసిన వాటికంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విగ్రహాలను వాడడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. మన భక్తి మన భవిష్యత్తుకి భరోసా ఇచ్చేలా ఉండాలి.. కానీ ప్రకృతిని పాడుచేసేలా ఉండకూడదు. కనుక మట్టితో చేసిన విగ్రహాలను వాడడం ఉత్తమం. మరి మట్టి విగ్రహాలు దొరకని వాళ్ళు మరియు వినాయకుని విగ్రహాన్ని తాయారు చేసి పూజించాలి అనుకునేవాళ్లు ఇంట్లో ఉండే వస్తువులతోనే సులువుగా వినాయకుని విగ్రహాన్ని తాయారు చెయ్యవచ్చు. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
న్యూస్ పేపర్లు , లేదా పాత పుస్తకాల కాగితాలు అందరికి అందుబాటులో ఉంటాయి. వీటితో కూడా వినాయకుని విగ్రహాన్ని తయారుచేయొచ్చు. ఇందుకోసం మొదటగా కాగితాలని నీటిలో నానబెట్టాలి. అనంతరం నానిన కాగితాలని మెత్తగా రుబ్బండి. ఇప్పుడు ఆ కాగితం గుజ్జుతో వినాయకుని విగ్రహాన్ని తాయారు చేయండి. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఫెవికాల్ ఉపయోగించండి. దీని వళ్ళ విగ్రహం విరిగిపోకుండా దృడంగా ఉంటుంది. తళుకులు, అద్దాలు, లేసులు ఉపయోగించడం ద్వారా ఈ విగ్రహం మరింత అందంగా ఉంటుంది. ఇంకా గోధుమ పిండిని ఉపయోగించి కూడా వినాయకుని విగ్రహాన్ని తయారు చెయ్యవచ్చు. ఇందుకోసం ముందుగా గోధుమ పిండిని కొద్దీ కొద్దిగా నీళ్లు ఉపయోగిస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని తో ముందుగా వినాయకుని ఆకారం తయారు చెయ్యాలి. తర్వాత కాళ్ళు,చేతులు, తొండం తయారు చేసి విగ్రహానికి జోడించాలి. విగ్రహం తయారీ పూర్తి అయిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. అనంతరం నీళ్లలో కరిగే రంగులు వెయ్యాలి. వినాయకున్ని భక్తితో పూజిద్దాం. ప్రకృతికి కీడు వాటిల్ల కుండా బాధ్యత వహిద్దాం.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!