ముఖ్యమంత్రి జగన్పై నోరు పారేసుకునే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నావా..?
నారా బ్రాహ్మణి పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును CID అరెస్టు చేస్తే.. చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ గగ్గోలు పెడుతున్నాడని ఆరోపించారు.
అంగట్లో అమ్ముడుబోయే సరుకు ఎంఐఎం
సికింద్రాబాద్ కు ఈరోజు అమిత్ షా అనే అచ్చోసిన ఆoబోతు ఒకటి వచ్చిందని, తెలంగాణ గురించి, సాయుధ పోరాటం గురించి మాట్లాడుతోందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర్య పోరాటంలో కానీ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ బీజేపీకి సంభందించిన ఒక్కరి పేరైన బీజేపీ చెప్పగలదా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వారోత్సవాలు జరపాలని డిమాండ్ చేసిన కెసిఆర్ తొమ్మిదేళ్లు అవుతుంది ఎందుకు విలీన వారోత్సవాలు జరపడం లేదు…? అని ఆయన అన్నారు. ఎంఐఎంను చూస్తే కేసీఆర్ ప్యాంట్ తడుస్తదని, అంగట్లో అమ్ముడుబోయే సరుకు ఎంఐఎం అని ఆయన అన్నారు. కాసిం రజ్వీ జిన్నకు పుట్టిన విష పిందే ఎంఐఎం అని ఆయన అభివర్ణించారు. మోడీతో కేసీఆర్ రాజీ పడ్డారు అందుకే కవిత లిక్కర్ విచారణ ఆగిపోయిందని ఆయన ఆరోపించారు.
ఆసియా కప్ గెలిచిన భారత్.. ట్విటర్లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. నిజం చెప్పాలంటే మ్యాచులో మన ఆటగాళ్లు అద్భుతం చేశారు. శ్రీలంక జట్టును ఏ టైంలో కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొట్టారు. ముఖ్యంగా హైదరాబాదీ ప్లేయర్ సిరాజ్ బౌలింగ్‌పై అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ సోషల్ మీడియాలో తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ శ్రీలంక మధ్య జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్ ట్రోఫీని గెలవాలన్నది ఇరు జట్ల కోరిక. దీంతో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ నిర్ణయం అతడి బ్యాట్స్‌మెన్‌కు నచ్చలేదని తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేవలం 50 పరుగులకే కుప్పకూలడానికి కారణం ఇదే.
ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి
2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ 8వ సారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా.. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. గిల్ 6 ఫోర్లు బాదగా, ఇషాన్ మూడు ఫోర్లు బాదాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. భారత్‌పై ప్రత్యర్థి జట్టులో ఇదే అత్యల్ప స్కోరు. భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. భారత ఫాస్ట్ బౌలర్ల ధాటికి 9 మంది శ్రీలంక ఆటగాళ్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. కుశాల్ మెండిస్ 17, దుషన్ హేమంత 13 మాత్రమే రెండంకెల స్కోరును తాకగలిగారు. కాగా.. పాతుమ్ నిస్సాంక 02, కుసల్ పెరీరా 0, సదీర సమరవిక్రమ 0, చరిత్ అసలంక 0, ధనంజయ్ డిసిల్వా 04, దసున్ షనక 0, దునిత్ వెల్లలాగే 08, ప్రమోద్ మధుషన్ 01 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్ కేసు.. సరైన సమయంలో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుంది
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
భగవాన్ విశ్వ కర్మ జయంతి రోజున ప్రధాని మోడీ పుట్టిన రోజు జరగడం ఆనందంగా ఉందని దేవ సింహ్ చౌహన్ తెలిపారు. సామాజిక, ఆర్ధిక ప్రగతికి కేంద్ర పథకాలు దోహదం చేస్తున్నాయన్నారు. సరికొత్త భారత్ ఆవిష్కరణకు బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. బీజేపీకి ఇంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే 2024లో అధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయన అన్నారు.
మనిషి లేదా కాకి! ఎవరు తెలివైనవారు.. రహస్యం చెప్పిన శాస్త్రవేత్తలు
మనిషి లేదా కాకి! ఎవరు తెలివైనవారు? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇటీవలి పరీక్షలు, అధ్యయనాలలో కాకులు చాలా తెలివైనవని కనుగొనబడింది. భూమిపై మనిషి అత్యంత తెలివైన జీవి ఇప్పటివరకు మనం విశ్వసిస్తున్నాం. కానీ విజువల్ మెమరీ, 3డీ ప్రదేశంలో ఎగరడం, భూమి అయస్కాంత క్షేత్రం అవగాహన ఆధారంగా అంచనా వేస్తే కాకులే మనుషుల కంటే మరింత తెలివైనవిగా తేలింది. దాహంతో ఉన్న కాకి ఒక గులకరాయిని కాడలో పెట్టి తన దాహాన్ని ఎలా తీర్చుకుందో చిన్నప్పటి నుండి మనం వింటున్నాము. ఈ కాకి కథ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ కథ ద్వారా కాకులు చాలా తెలివైనవని చూపించారు.
కాకులు తెలివైనవి. దీని కోసం కారు నుండి కాకులు గట్టి షెల్డ్ పండ్లను (గింజలు) తీయడం అనే కాన్సెప్ట్‌ను ప్రయోగించారు. 1978లో కాలిఫోర్నియాలోని కొంతమంది పరిశోధకులు అమెరికన్ కాకులు వాల్‌నట్‌లను రోడ్డుపై విసిరారు. కారు చక్రంతో తొక్కించినప్పుడు వాటిని ఎలా తింటాయో కనుగొన్నారు. శాస్త్రవేత్తలు 1997లో కాకుల ఈ ప్రవర్తనను అధ్యయనం చేశారు. దాని ప్రవర్తనను నిశితంగా పరిశీలించారు. వాల్‌నట్ గట్టి షెల్‌ను విచ్ఛిన్నం చేయడానికి కాకి కారును ఉపయోగించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు పర్యటించారు. (సెప్టెంబర్ 15 – 28) మధ్య పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులు వెళ్లగా.. అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకే పరిమితమైన ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక, యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే తొలిసారి.
నిపా వైరస్ కేరళలో మాత్రమే విధ్వంసం సృష్టిస్తోంది.. ఎందుకంటే ?
మలేషియాలో 19 ఏళ్ల క్రితం నిపా వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్ 2018 లో భారతదేశంలో కనుగొనబడింది. నిపా వైరస్‌ను తొలిసారిగా కేరళలో గుర్తించారు. అయితే ఐదేళ్ల తర్వాత కేరళలో నిపా వైరస్ విజృంభణ మరోసారి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో ఆరు నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే నిపా వైరస్ సోకిన రోగుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపా వైరస్ కేసులలో మరణాల రేటు 40 నుండి 70శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది కేరళలో నమోదైన ఆరు కేసుల్లో ఇద్దరు మరణించారు. నిపా వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి దాని వైరల్ జాతి. ఉదాహరణకు, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఈ జాతి వ్యాప్తి చెందుతుంది. ఇది మరణాల రేటు 90శాతం. కేరళలో కనిపించిన వైరస్ బంగ్లాదేశ్‌లో కనిపించే జాతి అని కేరళ అధికారులు చెబుతున్నారు.
ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో.. విజయ్ దేవరకొండ తన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలు తీసి వంద కుటుంబాలకు లక్ష చొప్పున గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో విజయ్ పై ఉన్న అభిమానం అభిమానుల్లో మరింత పెరిగింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా.. ? అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది.
డిటైల్ స్టేట్మెంట్ కోసం ఆయేషా తల్లిదండ్రుల వద్దకు సీబీఐ అధికారులు
2007 డిసెంబరు 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఆయేషా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే తాజాగా.. మరోసారి ఈ కేసుపై ఆయేషా తల్లిదండ్రులను విచారించేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో వారిని కలిసిన అధికారులు.. మరొకసారి డిటైల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే ఆయేషా తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు.
ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమకు సిట్ మీద నమ్మకం లేక సీబీఐ విచారణ అడిగామని తెలిపారు. అయితే సీబీఐ విచారణ ప్రారంభమై ఐదు ఏళ్ళు గడుస్తున్న కనీస ఫలితం రాలేదని అధికారుల వద్ద తమ నిరాకరణను వ్యక్తం చేశారు. తమ మత సంప్రదాయం కాకపోయినా న్యాయం జరుగుతుందని రీపోస్ట్ మార్టంకు సహకరించామన్నారు. తమ అమ్మాయి అవశేషాలు తీసుకుపోయిన అధికారులు జాడ లేకుండా పోయారని తండ్రి ఆరోపించారు. సీబీఐ చేస్తున్న విచారణ ఏంటో వాళ్లకే తెలియాలని.. పదిహేను సంవత్సరాలలో ఎంత మందికి స్టేట్ మెంట్ లు ఇవ్వాలి అంటూ సీబీఐ అధికారులను ఆయేషా తల్లిదండ్రులు నిలదీశారు.
ఏపీలో డబ్బు దొంగ తనంగా దోచుకున్నారు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చదువు కోసం స్కిల్ పేరుతో రూ.356 కోట్లు నిధులు మంజూరైతే.. చంద్రబాబు కొన్ని సెల్ కంపెనీ పేరుతో దోచుకున్నాడని దుయ్యబట్టారు. దోచుకున్నదంతా దోచుకుని ధబాయిస్తున్నాడని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు దొంగ తనంగా దోచుకున్నారని మండిపడ్డారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలతో వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టిందని చెప్పారు.
మరోవైపు జర్మనీకి చెందిన కొన్ని కంపెనీల పేరుతో చంద్రబాబు దొంగ కంపెనీ పెట్టి దోచుకున్నాడని మంత్రి ధర్మాన ఆరోపించారు. దొంగ కంపెనీ పేరుతో ఆరు కంపెనీలు వెలిసాయని.. ఆ ఆరు కంపెనీల పేరుతో చంద్రబాబు పీఏ కొంత డబ్బు, కొడుకు పీఏ అకౌంట్ వద్దకు కొంత డబ్బు వెళ్లిందని తెలిపారు. ఇప్పుడు వారిద్దరు పరారీలో ఉన్నారన్నారు. అయితే వారిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
అల్లా మా రూలర్.. అల్లా కోసమే ఉన్నాం.. అల్లా కోసమే పని చేస్తున్నాం..
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. సభకు ముందు ఎంఐఎం తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది. నాంపల్లి దర్గా నుంచి లక్డికాపూల్ హాకీ స్టేడియం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ బీజేపీలు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో సమైక్యం చేసేటప్పుడు ఎక్కడున్నాయి.? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు పర్సెంటేజ్ పరంగా తక్కువగా ఉన్న అందరిని కలుపుకుని పోతామని ఆయన అన్నారు. నిజాం కాలంలో కట్టినవే ఇంకా హైదరాబాద్ లో ప్రముఖంగా ఉన్నాయని, హై కోర్ట్, ఉస్మానియా హాస్పిటల్ లాంటివన్నీ నిజాం కట్టినవే అని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కలపడానికి పోలీస్ చర్య జరిగిందని, పండిట్ సుందర్ లాల్ ఇచ్చిన నివేదికలో ముస్లింలపై జరిగిన ఘటనలు వివరించారన్నారు. రజాకార్ల ఏరివేత పేరుతో ముస్లింలపై దారుణాలు చేశారు.. ఈ ఘటనలు నివేదికలో ఉన్నాయని, ఈరోజు హైదరాబాద్ కు అమిత్ షా వచ్చారు.. అబ్బధాలు చెప్పారన్నారు అసదుద్దీన్.