TSRTC : నాటి త్యాగధనుల పోరాట పటిమ స్పూర్తిదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ టి.ఎస్.ఆర్టీసీ కేంద్ర కార్యాలయం, బస్‌భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నాడు సాగించిన ప్రజా సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను, నాటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నాటి పోరాట పటిమను వివరించడమే కాకుండా ఆలోచింపజేసే విధంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఒక దశాబ్ధం క్రితం తాను వరంగల్, నల్గొండ, మెదక్‌లో పని చేసిన రోజుల్లో ప్రజలు నాటి రజాకర్ల దురాగతాల గురించి మాట్లాడుకునే వారని చెబుతూ నిజాం తూటాలకు బలైన మొదటి వీరుడు దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచిపోయారని కీర్తించారు. ఈ పోరాట పటిమలో తెలంగాణ ప్రజలతో పాటు కళ్యాణ్ కర్ణాటక, మరాఠ్వాడ ప్రాంతాల ప్రజలు ఆదర్శంగా నిలిచారన్నారు. అలాంటి ప్రాంతాల సందర్శనలో భాగంగా రెండు దశాబ్ధాల క్రితం జనగాం ఎ.ఎస్.పిగా భైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడి ప్రజలు నాడు ఎదుర్కొన్న ఘటనల్ని తనకు వివరించారన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
రజాకర్ల ఆకృత్యాలను, సామూహిక ఆత్యాచార సంఘటనల్ని తలచుకుని వారు ఎంతగానో బాధ పడ్డారని నాటి రోజుల్ని గుర్తు చేశారు. ఎన్నో బాధలను దిగమింగడంతో పాటు అనేక కష్టాలను చవిచూసి, ఎన్నో అన్యాయాలను సహించిన నాటి ప్రజలు తుదకు సామూహికంగా ప్రజా సాయుధ పోరాటం జరిపి విజయం సాధించిన రోజును మరిచిపోలేమంటూ వారి త్యాగనిరతిని శ్లాఘించారు. స్వాతంత్ర భారత దేశంలో తెలంగాణ విలీనం అయ్యేంత వరకు సాధించిన ఘన చరిత్రను తెలుసుకోవడంతో పాటు భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందనే విషయాన్ని మరవకూడదని చెప్పారు.
నాటి త్యాగమూర్తుల ఆశయ సాధనకు అందరం కృషి చేసి తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రగతికి బాటలు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎ,ఎం, పి అండ్ ఎఎం) ఎస్.కృష్ణకాంత్, ఇ.డి (ఒ), సంస్థ కార్యదర్శి మునిశేఖర్, జాయింట్ డైరెక్టర్ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, సి.ఎఫ్.ఎం విజయ పుష్ఫ, సీఈ (ఐటీ) రాజశేఖర్, సీటిఎం జీవన్ ప్రసాద్, సీపీఎం ఉషాదేవి, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..