Asaduddin Owaisi : అల్లా మా రూలర్.. అల్లా కోసమే ఉన్నాం.. అల్లా కోసమే పని చేస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. సభకు ముందు ఎంఐఎం తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది. నాంపల్లి దర్గా నుంచి లక్డికాపూల్ హాకీ స్టేడియం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ బీజేపీలు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో సమైక్యం చేసేటప్పుడు ఎక్కడున్నాయి.? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు పర్సెంటేజ్ పరంగా తక్కువగా ఉన్న అందరిని కలుపుకుని పోతామని ఆయన అన్నారు. నిజాం కాలంలో కట్టినవే ఇంకా హైదరాబాద్ లో ప్రముఖంగా ఉన్నాయని, హై కోర్ట్, ఉస్మానియా హాస్పిటల్ లాంటివన్నీ నిజాం కట్టినవే అని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కలపడానికి పోలీస్ చర్య జరిగిందని, పండిట్ సుందర్ లాల్ ఇచ్చిన నివేదికలో ముస్లింలపై జరిగిన ఘటనలు వివరించారన్నారు. రజాకార్ల ఏరివేత పేరుతో ముస్లింలపై దారుణాలు చేశారు.. ఈ ఘటనలు నివేదికలో ఉన్నాయని, ఈరోజు హైదరాబాద్ కు అమిత్ షా వచ్చారు.. అబ్బధాలు చెప్పారన్నారు అసదుద్దీన్.
Also Read : IND vs SL Final: ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
అంతేకాకుండా..’బీజేపీ పాత్ర ఏముందని వేడుకలు చేస్తున్నారు.? హైదరాబాద్ గురించి అమిత్ షా మాట్లాడుతున్నారు.. నిజాం, రజాకార్లు అంటున్నాడు చరిత్ర తెలియంది మాట్లాడుతున్నారు.. చేసిందేం లేదు కానీ మేమే చేస్తున్నాం అని చెప్తున్నాడు.. అమిత్ షా ని అడుగుతున్నాను.. అప్పుడు చెడ్డి వేసుకుంటుండే.. ఇప్పుడెందుకు ప్యాంట్ వేసుకుంటున్నారు.. ( ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి.. ). 95 శాతం చేసిన వారి దగ్గరికి వచ్చి ఐదు శాతం చేసి అంతా మేమే చేశాం అంటే ఎలా.? అల్లా మా రూలర్, అల్లా కోసమే ఉన్నాం, అల్లా కోసమే పని చేస్తున్నాం.. హర్యానాలోని నూహ్ లో జరిగింది ఏంటి.? ఎంతో మంది ఇళ్లను కాల్చేస్తున్నారు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అంటున్నారు ఇదేనా.? దేశంలో జరుగుతుంది చూస్తే తెలుస్తుంది.! కాంగ్రెస్ బిజెపిలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు ఏం చేస్తున్నాయి.. కాంగ్రెస్ బీజేపీలు మజ్లీస్ కు అంటాయి కానీ ముస్లింలకు చేసింది చెప్పవు.. తెలంగాణలో ముస్లిం పిల్లలకు హాస్టల్స్ ఉన్నాయి.. మెడికల్ సీట్స్ వస్తున్నాయి.. దారుసలాం అసదుద్దీన్ ది కాదు మీది.. దారుసలాంకు ఎవరైనా రావచ్చు.. దేశంలోని ఎవరైనా రావచ్చు..’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
Also Read : Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!