ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వికలాంగ క్రీడాకారిణికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి ధైర్యం నింపారు. పారా బ్యాడ్మింటన్లో వీల్ చైర్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో పడాల రూపాదేవి బంగారు పతకాలు సాధించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ రికార్డులు బ్రేక్ కాగా.. ఇంకొన్ని రికార్డులు అలానే ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ఈ ట్రోఫీని భారత్ చేజిక్కించుకుంటుండటంతో.. ఆస్ట్రేలియా మాత్రం పోరాడుతూనే ఉంది. మరోవైపు.. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాలో కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ జపాన్ను ఓడించింది. 2-0 తేడాతో జపాన్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఫైనల్లో చైనాతో తలపడనుంది. గ్రూప్ రౌండ్లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. చివరి గ్రూప్ రౌండ్ మ్యాచ్లో జపాన్తో తలపడింది. అప్పుడు కూడా భారత్ 3-0తో గెలిచింది.
సింహాచలం దేవస్థానం ఆలయ భూములు అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ జరగనుంది. త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణ జరపనుంది. కమిటీ సభ్యులను కూడా విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు.
బీట్రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయని మీకు తెలుసా.. బీట్రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి.
సోలార్ పవర్ ప్లాంట్ వద్ద మట్టితోలే అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో మరోమారు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు.
టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలో.. కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V ముందుకొస్తుంది. ఈ బైక్ గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్తో అమర్చారు. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్. టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది.
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే.