సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు.
కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కంట తడి పెట్టుకున్నారు. బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షన్మోహన్ ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు.
తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు.
వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం.. రూ.47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు…
భారత్ మార్కెట్లో ICE SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
విజయవాడలోని ప్రముఖ క్షేత్రమైన ఇంద్రీకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్ రోడ్డును 3 రోజుల పాటు మూసివేశారు. ఇవాళ్టి సాయంత్రం నుంచి ఈ నెల 22 వరకు ఘాట్‌రోడ్డును మూసి ఉంచనున్నారు. కొండరక్షణ చర్యల పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్ రాకపోకలపై ఆంక్షలు విధించారు.
కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. కానీ అధికంగా ఉంటే చాలా హానికరం. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ధమనులు మూసుకుపోతాయి. ఈ క్రమంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఆహారం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వచ్చే పదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తాం హనుమకొండలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని, వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు. మహిళ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో అన్ని ఆ నాటి ఇందిరమ్మ ప్రభుత్వం లో తెచ్చినవే.. అలాంటి…
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత క్యాచ్ పట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్న స్మృతి.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని కనబర్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అభిమానుల మనసు గెలుచుకుంది స్మృతి మంధాన. కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది.