IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆస్ట్రేలియన్లను కంగారెత్తించిన భారత బౌలర్లు
- ముగిసిన మొదటి రోజు ఆట
- 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- 83 పరుగుల వెనుకంజలో ఆస్ట్రేలియా
- 4 వికెట్లు తీసిన బూమ్రా
- మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌటైన టీమిండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అలెక్స్ కారీ (19), మిచెల్ స్టార్క్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. తక్కువ స్కోరుకే ఆలౌటైన టీమిండియా.. బౌలింగ్‌లో మాత్రం చెలరేగారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను కంగారెత్తించారు. కెప్టెన్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులోకి రాగానే.. దూకుడు బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపించారు. బుమ్రాకు తోడు సిరాజ్ కూడా తోడయ్యాడు. అతను కూడా 2 వికెట్లు తీశాడు. మరోవైపు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హర్షిత్ అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. తాను కూడా ఒక వికెట్ పడగొట్టాడు.
Read Also: DK Shivakumar: ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే..
Also Read
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్కోరు వద్ద మెక్‌స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 19 పరుగుల వద్ద ఖవాజాను బుమ్రా ఔట్ చేశాడు. తర్వాతి బంతికి స్టీవ్ స్మిత్ కూడా ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా 31 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మార్నస్ లాబుషాగ్నేను కూడా సిరాజ్ పెవిలియన్ కు పంపించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను బుమ్రా క్యాచ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 83 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
Read Also: Maharashtra Elections 2024: మహాయుతి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం..
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!