గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే విడుదలకు ముందు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా పిక్సెల్ 8 ప్రోలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ టెలిఫోటొ కెమెరాతో ఫొటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. 30 సార్లు జూమ్ చేసినా క్లారిటీ ఏమాత్రం తగ్గదట.
పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలో చాలా గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పిక్సెల్ 8.. రిఫ్రెష్ రేట్ 60Hz నుండి 120Hz వరకు ఉంటుంది. ఇది 6.2-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, ఇది 2000 నిట్‌ల గరిష్ట లైటింగ్ తో వస్తుంది. పిక్సెల్ 8 ప్రో.. 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్‌ల గరిష్ట లైటింగ్ తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
Khalistani Group: కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు
గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసిన టెన్సార్ జీ3 చిప్ సెట్ తో ఈ ఫోన్లు రానున్నాయి. టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 లో 128 జీబీ, 256 జీబీ స్టోరేజీ ఆప్షన్లు ఉంటాయి. పిక్సెల్ 8 ప్రో లో 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ ఆప్షన్లు ఉండనున్నాయి.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. పిక్సెల్ 8.. 4575mAh బ్యాటరీతో రానుంది. ఇది 27w ఫాస్ట్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. దాంతో పాటు 18W Qi వైర్‌లెస్ ఛార్జర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇక.. పిక్సెల్ 8 ప్రో 5050mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 23W Qi వైర్‌లెస్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది.
Ponguleti: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం..!
ఇక కెమెరా విషయానికి వస్తే.. పిక్సెల్ 8 లో 50MP ప్రైమరీ కెమెరా.. 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ తో రానుంది. ఫ్రంట్ కెమెరా 10.5 ఎంపీ డ్యూయల్ పీడీ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. అదే పిక్సెల్ 8 ప్రో లో 50 మెగా పిక్సెల్ ఆక్టా పీడీ వైడ్ కెమెరా, 48 మెగా పిక్సెల్ క్వాడ్ పీడీ అల్ట్రావైడ్ కెమెరా, 48 మెగాపిక్సెల్ క్వాడ్ పీడీ టెలిఫోటో కెమెరా విత్ సూపర్ రిజొల్యూషన్ జూమ్ (30x) తో ఫొటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుంది. 10.5 మెగాపిక్సెల్ డ్యూయల్ పీడీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.