చితిపై తగలబడుతుండగా స్పృహ.. ఒక్కసారిగా లేచిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు రోహితాష్ కుమార్ అనాథగా ఉంటున్నాడు. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోతే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చి చికిత్స అందించారు. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రోహితాష్ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. దీంతో షెల్టర్ హోం నిర్వాహకులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసి.. చితిపై రోహితాష్ కుమార్ మృతదేహాంగా పెడుతున్న సమయంలో అతడు శ్వాస తీసుకోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే అంబులెన్స్ లో రోహితాష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారి మహేంద్ర ముండ్, సామాజిక న్యాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పవన్ పూనియా కూడా ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
నిమ్మరసం, వేపాకు, పసుపుతో.. స్టేజ్ 4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సిద్ధూ భార్య..
మాజీ క్రికెటర్, పొలిటిషీయన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌ని విజయవంతంగా ఓడించారు. ఆమె బతికే అవకాశం 3 శాతం మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించినప్పటికీ, స్టేజ్-4 క్యాన్సర్‌ని అధిగమించారిన నవజ్యోత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నవజ్యోత్ కౌర్ ఒక సంవత్సరం నుంచి స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతోంది. స్టేజ్-3 ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో వైద్యులు చిన్న ఆశ కల్పించాలరని వెల్లడించారు.
రూ.5,260 కోట్ల ఫార్మా కంపెనీల పెట్టుబడులు.. 12,490 మందికి ఉద్యోగాలు
దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభించిన సిట్..
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణను సిట్ ప్రారంభించింది. ఉదయం తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలిసి సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి సీబీఐ డైరెక్టర్‌కు నివేదికను ఇవ్వనుంది ఈ బృందం. డీస్పీలు సీతా రామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యల పోలీసు అధికారుల బృందం తిరుపతి, తిరుమల, AR డైరీలలో విచారణ చేయనున్నారు.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు
హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనుంచి చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే మా లక్ష్యమని ఆయన తెలిపారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లు, విలేజ్ మ్యాప్ లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. అమీన్ పూర్ చెరువు తూములు మూయడం వల్ల లేఔట్లు మునిగాయని, ఎఫ్ టీఎల్ లెవల్ పరిగణలోకి తీసుకొని చెరువుల సర్వే చేపట్టామని, తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామని ఆయన అన్నారు. అనుమతులు లేకుండా ఉన్న పెద్దవాళ్లవైనా, పేదల వైనా కూల్చక తప్పదన్నారు.
విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి
గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది. ఈ క్రమంలో వంశీకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. వెంటనే తోటి కానిస్టేబుళ్లు వంశీకృష్ణను జీజీహెచ్‌కు తరలించారు. అయితే ఈలోపే అతను మృతి చెందారని వైద్యులు తెలిపారు. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా.. లేక వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. హెడ్ కానిస్టేబుల్ వంశీకృష్ణ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
నేనూ బాధితురాలినే.. కాస్టింగ్ కౌచ్ పై కుష్బూ సంచలన వ్యాఖ్యలు..
స్త్రీ గొప్పతనం అనేది అంతటా ఒక అనువర్తనం, అనుభవం, మానవత్వం యొక్క ప్రతీక. స్త్రీలు తమ జీవన కాలంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ప్రతికూలతలను దాటుకొని అగ్రతలపై ఎదుగుతూ వస్తున్నారు. వారివి నిజంగా అద్భుతమైన జీవన కథలు. వీరి గొప్పతనం వివిధ రంగాలలో ప్రతిబింబిస్తుంటుంది.. అయితే.. ప్రస్తుత ప్రపంచంలో ఈదేశం.. ఆ దేశం అని ఏమీ లేదు.. ఎక్కడైనా.. ఆడవారు బయట కనిపిస్తే వంకర బుద్ధితో చూసేవారే ఎక్కువ.. ఈ లైంగిక వేధింపులు ప్రతి రంగంలో జరిగేవి. అయితే సినిమా పరిశ్రమలో స్త్రీలు ఎదుర్కొనే అవమానాలు మరింత ఎక్కువనే చెప్పాలి. కొందరు అవకాశం ఇచ్చేందుకు, మరికొందరు డబ్బు వాగ్దానాలు చేసి, కొందరు హీరోయిన్లతో కమిట్మెంట్లు అడుగుతారు. ఈ రకమైన వేధింపులు ఎన్నో కాలాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, గత తరం హీరోయిన్లు ఈ అంశాలను బయట పెట్టడానికి తడబడ్డారు.
అదానీ లంచం ఆరోపణలపై సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
అదానీ గ్రూప్ లంచాల వ్యవహారం భారతదేశాన్ని కుదిపేస్తోంది. అమెరికా చేసిన ఆరోపణలు ప్రస్తుతం పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక గురువారమైతే మార్కెట్ షేర్లు అన్నీ భారీగా పడిపోయాయి. తాజాగా తమిళనాడులోని స్టాలిక్ ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. అదానీ గ్రూప్ లంచాల ఆరోపణలను స్టాలిన్ తోసిపుచ్చారు. అదానీ గ్రూప్‌తో తమకు సంబంధాలు లేవని పేర్కొంది. దీనిపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
2021లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ అదానీ గ్రూపుతో ఎలాంటి ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోలేదని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. “తమిళనాడు విద్యుత్ శాఖకు అదానీ గ్రూపుతో ఎలాంటి వాణిజ్య లేదా ప్రత్యక్ష సంబంధాలు లేవు. ’’ అని బాలాజీ పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో తమిళనాడు ప్రభుత్వం 1,500 మెగావాట్ల సోలార్ పవర్‌ను యూనిట్‌కు 2.61 రూపాయల పోటీ రేటుతో 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ సర్వే దేశానికే ఆదర్శం.. కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే
అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది. అతి తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఇంత తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించి కొత్త రికార్డు నెలకొల్పింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే రాష్ట్రం నలుమూలాల విజయవంతంగా సాగుతోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్లో 99.9%, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99% శాతం సర్వే పూర్తయింది. కామారెడ్డిలో 98.5%, మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇండ్లకు తాళాలున్నవి.. ఇలాంటివి మినహాయిస్తే వీటన్నింటా సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు.. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి కూడా..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు. జగన్ వ్యక్తిత్వ హననం చేయని రోజూ చంద్రబాబు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. పనామా లీక్స్, పారడైస్ పేపర్స్ అంటూ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. జగన్‌ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు. జగన్‌కు 40 శాతం ఓటింగ్ రావటంతో దాన్ని ఎలాగైనా చంపాలని చంద్రబాబు అండ్ బ్యాచ్ రాక్షసులు విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.