ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు.
రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ఉంటుందన్నారు. మిగతా అభ్యర్థులను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. గెలుపు, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. పొత్తులపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు
ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటు చేసుకుంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి అని... మొదటి నుండి ఆయన గుణం అదేనని తెలిపారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మీడియా సమావేశం ద్వారా కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అశోక్ నగర్లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య విరుచుకుపడ్డారు. తనని దసరా బుల్లోడు సంక్రాంతి గంగిరెద్దుగా అభివర్ణించడంతో పరుష పదజాలంతో ప్రశ్నించారు. రేగా కాంతారావు నువ్వు గెలిచింది ఎక్కడా.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బులకి అమ్ముడుపోయిన నువ్వా నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలని అన్నారు.
వన్డే ప్రపంచకప్ లో భాగంగా.. ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హైఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుని.. పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. అయితే భారత్ బౌలర్ల విజృంభణతో పాకిస్తాన్ బ్యాటర్లు చెతులేత్తేశారు. నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ 191 పరుగులు చేసింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం తప్పింది. కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ వద్దకు రాగానే గమనించిన డ్రైవర్ చాకచక్యంగా.. ఎవరికి హాని కలగకుండా పార్క్ వైపు ఉన్న ఫుట్‌పాత్ పై బస్సును ఆపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.