Pravalika Case: ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మీడియా సమావేశం ద్వారా కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అశోక్ నగర్‌లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితమే హాస్టల్‌లో చేరిందని.. గ్రూప్స్ ప్రిపేర్ కావడానికి నగరానికి వచ్చిందని విచారణలో తెలిసిందన్నారు. గత కొన్నాళ్లుగా శివరామ్ అనే వ్యక్తితో ప్రవళిక ప్రేమలో ఉందని, ప్రవళిక ప్రేమించిన అబ్బాయికి వేరే అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని డీసీపీ వెల్లడించారు. ప్రవళికను మోసం చేసి శివరామ్ మరొకరితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని.. శివరామ్ చేసిన మోసాన్ని ప్రవళిక జీర్ణించుకోలేక పోయిందని చెప్పారు. అది తట్టుకోలేకే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రవళిక ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుసని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Also Read: Hyderabad: బస్సుకు బ్రేకులు ఫెయిల్.. తప్పిన ప్రమాదం
పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. “వరంగల్ చెందిన ప్రవల్లిక గ్రూప్స్ ప్రిపేర్ కోసం నగరారానికి వచ్చింది. 15 రోజులుగా హాస్టల్‌లో ఉంది. ప్రవళిక రూమ్‌మేట్స్ సంధ్య, అక్షయ, శ్రుతి ప్రవళిక రూంలో ఉన్నారు. ప్రవళిక మాట్లాడేది కాదు. నిన్న రాత్రి రూంలో ప్రవళిక సూసైడ్ చేసుకుందని 8:30 సమాచారం వచ్చింది. ఆమె ఫ్రెండ్స్‌ను విచారించాం. స్టూడెంట్స్, పొలిటికల్ లీడర్స్ ధర్నా చేశారు . అర్దరాత్రి పోస్ట్ మార్టం చేసి ప్రవళిక రూంలో పంచనామా చేశాం. సూసైడ్ నోట్ రాసి ఉంది. మొబైల్ ఫోన్ సీజ్ చేసాము. ప్రవళిక అబ్బాయితో చాటింగ్ చేసి ఉంది. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రవళిక చాటింగ్ చేసి ఉంది. ప్రవళిక లవ్ సింబల్స్‌తో రాసిన లెటర్స్ సీజ్ చేసాము నిన్న ఉదయం అశోక్ నగర్‌లో బాలాజీ దర్శన్ హోటల్ వద్ద టిఫిన్ చేశారు సీసీ కెమెరా ఫుటేజ్ సీజ్ చేసాము. అమ్మాయి ప్రవళికని శివ రామ్ రాథోడ్ అనే యువకుదు చీటింగ్ చేశాడు. వేరే అమ్మాయితో శివ రామ్ రాథోడ్ అనే యువకుడు ఎంగేజ్ మెంట్ కుదిరింది. ప్రవళిక తమ్ముడు కూకట్‌పల్లిలో ప్రణయ్ డిగ్రీ చేస్తున్నాడు . ప్రవళిక పేరెంట్స్‌కి కూడా ప్రవళిక ప్రేమ వ్యవహారం తెలుసు. లవ్ లెటర్ & సీసీ కెమెరా ఫుటేజ్ & మొబైల్ ఫోన్& పూర్తి ఎవిడెన్స్ సూసుడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపాము. అమ్మాయి గ్రూప్స్ అప్లయ్ చేయలేదు. శివరాం రాథోడ్‌పై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తాం. శివరాం రాథోడ్ సీడీఆర్ కలెక్ట్ చేస్తాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం. ధర్నా చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన నాయకులపై కేసులు నమోదు చేశాం.” అని పోలీసులు తెలిపారు.