టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి అని… మొదటి నుండి ఆయన గుణం అదేనని తెలిపారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. అలాంటిది కేటీఆర్ బాత్ రూం లు కడిగేదని అంటావా అని మండిపడ్డారు. గోడల మీద రాతలు రాసుకొనే బ్రతుకు నీది అని రేవంత్ రెడ్డిని విమర్శించారు.
Israel-Hamas War: హమాస్ కీలక కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్.. మిగతా వారికి ఇదే గతని వార్నింగ్..
సంవత్సరానికి ఒక పార్టీ మారే వ్యక్తివి నీవు అని మంత్రి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండంగల్ లో చిత్తుచిత్తుగా ఓడిస్తే, మల్కాజ్గిరి నుండి పోటీ చేశావని… దమ్ముంటే రంగారెడ్డి నుండి పోటీ చేయమని అన్నారు. నువ్వు రెండు సార్లు, పొన్నాల రెండు సార్లు ఓడిపోయారు.. కానీ పొన్నాలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుండి ఘోరంగా పడిపోతుందని ఆరోపించారు.
Pravalika Case: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం.. పోలీసుల కీలక ప్రకటన
ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ మ్యానిపెస్టో విడుదల అవుతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ మొత్తం పడిపోతుందని విమర్శించారు. సీనియర్ నాయకులు పొన్నాలను పార్టీ నుండి దూరం కొట్టడమే కాక నీచమైన మాటలు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కూడా 10 ఏండ్లు పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తి పొన్నాల అని అన్నారు. అలాంటి వ్యక్తిని తిట్టడం బాధాకరమని… నువ్వు మధ్యలో వచ్చావ్, దందాలు చేసే బ్రోకర్ వి అని విమర్శలు గుప్పించారు.