శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచరిస్తుండడం కలకలం రేపింది. ఇవాళ్టి నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీ గోపురాన్ని ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బంగికి నాగుపాము కనిపించింది.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరం, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దన్నారు కేఏ పాల్.
స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం తప్పా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను వ్యతిరేకమని సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
పంచకప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించడం సంతోషకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దేశభక్తులు, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మ్యాచ్ చూసారన్నారు. ఇంతటి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం సంతోషమని.. ఈ విజయంతో దేశం అంతా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది మూర్ఖులు పాకిస్తాన్ ఓడిందని…
వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది.
తెలంగాణ ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పట్టండి.. డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ఆలోచనలతో, ప్రణాళిక బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ మీడియా సమావేశం నిర్వహించారు.