చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవ్వరుబడితే వారే మాట్లడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను…
Breaking news: దేశం రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఆర్మీ సైనికులు. ప్రతి క్షణం వాళ్ళకి కత్తి మీద సాములాంటిదే. ఏమాత్రం ఆదమరిచి ఉన్న అపాయం ముంచుకు వస్తుంది. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం..శనివారం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలలోకి వెళ్తే శనివారం ఒక సాధారణ శిక్షణా మిషన్లో పాల్గొన్న చేతక్ హెలికాప్టర్ ని అత్య అవసరంగా ల్యాండ్…
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
Bihar Crime News: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అంటే ఏ పని చేసిన పిడికెడు అన్నం కోసమే. దాని కోసం మనిషి నానాయాతన పడుతుంటారు. ప్రస్తుతం యూట్యూబ్ హావ నడుస్తుంది. కొందరు నేమ్, ఫేమ్ కోసం యూట్యూబ్ ని ఎన్నుకుంటే.. కొందరు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి యూట్యూబ్ ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో క్లిక్ అయితే నేమ్, ఫేమ్ తోపాటు మంచి సంపాదన కూడా వస్తుంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ ఆసరా…
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం... కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు.
Plane Crashed: శనివారం నేపాల్లో మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలింది. వివరాలలోకి వెళ్తే. ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంపు సమీపం లోని లుక్లా నుంచి హెలికాప్టర్ 9N ANJ నేపాల్ లోని లోబుచే బయలుదేరింది. కాగా నేపాల్లోని లోబుచేలో ల్యాండ్ అయ్యే సమయంలో బోల్తా పడింది. దీనితో హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ నిరౌలా మాట్లాడుతూ.. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్…
Viral news: పట్టెడు అన్నం పెడితే చాలు మూగజీవులు ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. వాటి ప్రేమలో ఎలాంటి స్వార్ధం ఉండదు. నిస్వార్ధ ప్రేమకు మూగ జీవులు నిలువెత్తు నిదర్శనం. అనడానికి ఇదే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. యుపి లోని అమ్రోహా లోని డిడోలి జోయా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్కున్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతను గత రెండు నెలల నుండి ఓ కోతికి ప్రతి రోజు క్రమం తప్పకుండా రొట్టిని అందిస్తున్నాడు.…
solar eclipse: సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం అయినప్పటికి హిందూ మంతంలో మాత్రం ఈ గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఉంది. ఈ మాట ఇప్పుడు చెప్పుకోవడానికి గల కారణం.. ఈరోజు అంటే 14 అక్టోబర్ 2023న సూర్యగ్రహణం సంభవించనుంది. కాగా ఈ ఏడాదిలో ఇది రెండవ సూర్యగ్రహణం. శారదీయ నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ గ్రహణం ఏర్పడనుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? ఈ ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడనుందో ఇప్పుడు…