Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Bjp Chief Purandeshwari Fires On Ap Cm Ys Jaganmohan Reddy

Purandeshwari: అమిత్ షా-లోకేష్ భేటీపై స్పందించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే?

Published Date :October 14, 2023 , 7:15 pm
By Mahesh Jakki
Purandeshwari: అమిత్ షా-లోకేష్ భేటీపై స్పందించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Purandeshwari: అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు. కిషన్ రెడ్డి నన్ను పిలిచారని లోకేష్ అన్నారని.. దాని గురించి ఆయన్నే అడగాలని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయమని ఆమె తెలిపారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనని ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి.. సబ్ జుడిస్ కిందకు వస్తాయన్నారు.

Also Read: Podem Veeraya: రేగాకాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

Also Read

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..

మద్యం విషయంలో ప్రభుత్వం తీరును తప్పు పట్టానని.. తనను వైసీపీ నేతలు తప్పుబట్టారన్నారు. తాను చేసిన కామెంట్లను తప్పు పడుతూ కేవలం 18.7 శాతం మంది మాత్రమే మద్యం తాగుతున్నారని అధికార పార్టీ నేతలు చెప్పారని పురంధేశ్వరి పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలవన్నీ అవాస్తవాలేనని ఆమె అన్నారు. నేషనల్ ఫ్యామ్లీ హెల్త్ సర్వే ప్రకారం మద్య వినియోగదారుల సంఖ్య 1.29 కోట్ల మంది అని, క్రిసెల్ సర్వే ప్రకారం 34.5 శాతం మేర 1.80 కోట్ల మంది మద్యం వినియోగదారులు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 40 లక్షల మంది మాత్రమే మద్య వినియోగదారులు ఉన్నారంటూ కాకి లెక్కలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా మద్యం విషయంలో మేం ఉద్యమించామని పురంధేశ్వరి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 12 లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకు లైసెన్సులిచ్చారని.. ప్రస్తుతం ఉన్న మద్యం కంపెనీల యజమానులు గతంలో ఎవరు..? ఇప్పుడెవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం కంపెనీ తయారీదారులను బెదిరించి ఓనర్ షిప్ మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం కంపెనీ ఓనర్ల పేర్లు సాయంత్రానికల్లా బయటపెట్టే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ ఆమె సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే మద్యం అమ్మకం, తయారీదారులపై కేసులు పెడతామని జగన్ చెప్పారని.. మద్యం కంపెనీలపై కేసులు పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికుందా అంటూ ప్రశ్నించారు. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు.

Also Read: PM Modi: నవరాత్రి వేళ ప్రధాని రాసిన “గర్బా” సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న వీడియో..

పురంధేశ్వరి మాట్లాడుతూ..” మద్యం అమ్మకాల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్సుకు అక్రమంగా తరలించేందుకు డిజిటల్ పేమెంట్లు అమలు చేయడం లేదు. గత రెండేళ్ల కాలంలో నాసిరకం మద్యం వల్ల చాలా మంది అనారోగ్యం బారున పడ్డారు. గత రెండేళ్ల కాలంలో నాసిరకం మద్యం ద్వారా అనారోగ్యం బారిన పడ్డ కేసులు 25 శాతం పెరిగింది. నాసిరకం మద్యం వల్ల మరణించిన వారి పేర్లు.. ఇతర వివరాలు కూడా మేం సేకరించాం. మద్యం మృతుల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరించ లేకపోతోంది. నాసిరకం మద్యం వల్ల ఇబ్బందులు ఉంటాయని.. రోగాలు పెరుగుతాయని ఎస్జీఎస్ ల్యాబరేటరీ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. మద్య వినియోగం తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నా.. క్రిసిల్ సర్వే ప్రకారం మద్య వినియోగం పెరిగిన రాష్ట్రాల్లో ఏపీ పేరే ముందు వరుసలో ఉంది. నాసిరకం మద్యం వల్ల కిక్ రాని వారు అదనంగా బాటిళ్లు సేవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బడ్డి కొట్లు.. ఇళ్లల్లోనూ మద్యం స్టాక్ పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఇవన్నీ బెల్ట్ షాపులు కావా..? ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామన్న జగన్ హామీ ఏమైంది..? హామీలు అమలు చేయని వారికి పదవిలో కొనసాగే అర్హత లేదని జగన్ ఎన్నికల ముందు చెప్పారు. మద్యంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోని జగన్ రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారా..? మద్య నిషేధం అమలు చేయబోమని సంతకం పెట్టి మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టిన మాట నిజం కాదా..?. శాండ్, లిక్కర్ విషయంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోంది. గోదావరి జలాలను పెన్నాతో లింక్ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వం.. ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం గోదావరి-పెన్నా ప్రాజెక్టు డీపీఆర్ చూపించి రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఇది దారుణం కాదా..? గతంలో ఏదైనా ఆరోపణలు వస్తే వైఎస్ సీబీఐ ఎంక్వైరీ వేయించారు.. ఇప్పుడు తన మీద వస్తున్న ఆరోపణల మీద సీబీఐ విచారణ చేయించగలరా..?” అని ఆమె పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • andhrapradesh
  • ap bjp chief
  • AP CM YS Jaganmohan Reddy
  • Chandrababu Arrest

తాజావార్తలు

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!

  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions