Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం తప్పింది. కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ వద్దకు రాగానే గమనించిన డ్రైవర్ చాకచక్యంగా.. ఎవరికి హాని కలగకుండా పార్క్ వైపు ఉన్న ఫుట్పాత్ పై బస్సును ఆపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
New Clothes : కొత్త బట్టలను అలానే వేసుకుంటున్నారా? ఆ సమస్యలు వస్తాయి జాగ్రత్త..
ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు బస్సు డ్రైవర్ వెంకటేష్ గౌడ్ తెలిపాడు. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయన్న విషయాన్ని గమనించి ప్రాణపాయం నుంచి తప్పించగలిగాడు. దీంతో డ్రైవర్ వెంకటేష్ గౌడ్ సమయస్ఫూర్తిని పలువురు ప్రయాణికులు అభినందించారు.
Pension Scheme: కేవలం రూ. 210 కడితే..నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు..