పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
చలికాలంలో కండరాలు, ఎముకల్లో నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం యొక్క కండరాలు, సిరలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో.. సిరల్లో నొప్పి, వాపు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది. నేషనల్ హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్.. ఈ విటమిన్ లోపం వల్ల చేతులు, కాళ్ళ నరాలలో నొప్పిని కలిగిస్తుంది.
జెడ్డాలో ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలం జరిగింది. ఈ వేలంలో బిడ్డింగ్కు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పేరును ఇవ్వలేదు. అయితే.. అందుకు గల కారణాన్ని స్టోక్స్ చెప్పాడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ. 3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు.
ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ డౌక్ సెంటర్లో బుధవారం (నవంబరు 27)న ఉదయం 09:30 గంటలకు గుడివాడ శాసనసభ్యులు వెదిగండ్ల రాము ప్రారంభించారు.
2024 డిసెంబర్ 4న అమేజ్ 2024ని హోండా విడుదల చేయనుంది. అయితే.. ఈ కారు లాంచ్ కాకముందే.. బుకింగ్ అనధికారికంగా ప్రారంభమయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ కార్ బుకింగ్లను కొంతమంది డీలర్లు తీసుకుంటున్నారు. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది