అమరావతి: నేడు సోషల్‌మీడియా కేసులపై విచారణ. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించనున్న హైకోర్టు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి సహా ఇతరుల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ.
కడప: సీఎం వద్దకు చేరిన ఫ్లయాస్ పంచాయతీ. ఇవాళ సీఎంవో ఆఫీస్‌కు రావాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలకు అధిష్టానం పిలుపు.
తెలుగు రాష్ట్రాల్ల నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,340 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.98,100 లుగా ఉంది.
నేడు ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్. పాక్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో షెడ్యూల్‌పై సందిగ్ధత.
ప్రొ కబడ్డీలో నేడు రెండు మ్యాచ్‌లు. రాత్రి 8గంటలకు తమిళ్ తలైవాస్-హరియాణా స్టీలర్స్ మ్యాచ్. రాత్రి 9 గంటలకు గుజరాత్ జెయింట్స్-పుణేరి పల్టాన్ మ్యాచ్.
ఢిల్లీ: నేడు సీడబ్ల్యూసీ సమావేశం. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు AICC ప్రధాన కార్యాలయంలో CWC భేటీ. సమావేశానికి CWC సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు. హాజరుకానున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు. తెలంగాణ నుంచి హాజరుకానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌రెడ్డి. ఏపీ నుంచి హాజరుకానున్న రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు.
తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాన్. కారైకాల్-మహాబలిపురం మధ్య రేపు తీరం దాటే అవకాశం. గంటలకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫెంగల్. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.
హైదరాబాద్‌లో పెరిగిన చలితీవ్రత. ఆదిలాబాద్ 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. మెదక్ 11.4, పటాన్ చెరులో 12.2 డిగ్రీలు, హనుమకొండ 13.5, రామగుండం 13.8 డిగ్రీలు. నిజామాబాద్‌లో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్. కేసీఆర్ దీక్షకు 15 ఏళ్లు పూర్తి. నేడు కరీంనగర్ జిల్లా అలుగునూర్‌కు కేటీఆర్. ఉదయం 10.30 గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళి. బైక్ ర్యాలీతో అలుగునూరు చౌరస్తా చేరుకోనున్న కేటీఆర్. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్న కేటీఆర్. దీక్షా దివస్ బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం. మంత్రి నారాయణ అధ్యక్షతన సమావేశం. అమరావతి సీఆర్డీఏ భూ కేటాయింపులపై చర్చ.
విజయవాడలో మాజీ రాష్ట్రపతి కోవింద్. నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న కోవింద్. ఏపీ గవర్నర్ బంగ్లాలో కోవింద్ బస. రేపు KLU స్నాతకోత్సవంలో పాల్గొననున్న కోవింద్.
నేడు విశాఖలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన. ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించనున్న మంత్రి.
నందిగం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ. మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేష్‌పై కేసు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేష్.
నేటి నుంచి అండర్-19 ఆసియాకప్ క్రికెట్ టోర్నీ. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న బంగ్లాదేశ్. ఈనెల 30న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.