జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్‌హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్ జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్‌హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్న మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చేవారం మన్నెగూడ పనులు ప్రారంభించండి.. మనం ప్రజల కోసం, రైతుల కోసం పని చేస్తున్నాం – కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అని ఆయన…
ఐపీఎల్ 2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. జెడ్డాలో ఆటగాళ్లకు సంబంధించి 10 ఫ్రాంచైజీల మధ్య రెండు రోజుల పాటు బిడ్డింగ్ జరిగింది. ప్రతి ఫ్రాంచైజీ తమ తమ జట్లలో 18 నుంచి 25 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఈ క్రమంలో.. జట్లు బలాబలాలేంటి.. ఏ జట్టు వేలంలో ఆచితూచి అడుగులు వేసింది. ఏ ఫ్రాంచైజీ మంచి జట్టును సిద్ధం చేసింది.. ఏ ఫ్రాంచైజీ బలహీనమైన జట్టుగా ఉంది. వేలంలో ఏ ఫ్రాంచైజీ తప్పుడు…
చలికాలంలో చర్మాన్ని, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అంతే జాగ్రత్తగా జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది.
స్ట్రాంగ్ బౌలింగ్ కోసం ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను కొనుగోలు చేసింది. అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ మిస్టరీ స్పిన్నర్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ ఇతన్ని సొంతం చేసుకుంది.
పిజ్జా అంటే దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తినడానికి ఎక్కువగా లైక్ చేస్తారు. వివిధ రకాల పదార్థాలతో పిజ్జాలను తయారు చేసి అమ్ముతుంటారు. మీరు కూడా పిజ్జాలో అనేక రకాల పిజ్జాలను తినే ఉంటారు. అయితే చైనాలో ఓ వెరైటీ పిజ్జా భారీగా సేల్స్ అవుతుండటంతో పాటు.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనీయుల ఆహారం గురించి ప్రపంచ మొత్తం తెలుసు.. వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాములు, క్రిములు, కీటకాలు,…
ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు.
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు.
కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే? మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్…
ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.