తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో హార్దిక్ పాండ్యా దూకుడు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా.. ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 69 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలను గుర్తించారు. బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది.
జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు రానుందన్నారు.
హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించరు. కొన్నిసార్లు బంతి తాకడం, జారి పడిపోవడం, పరుగెడుతుంటే నరాలు పట్టేయడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. 10 సంవత్సరాల క్రితం జరిగిన విషాద సంఘటన ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎంతో దు:ఖంలోకి నెడుతుంది.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. దిలావర్ పూర్-గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని చెప్పారు.
ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అపారమైన ఆదరణ కారణంగా, ప్రపంచంలోని ఇతర క్రికెటర్ల కంటే ఇక్కడి ఆటగాళ్ల బ్రాండ్ విలువ చాలా ఎక్కువ. ఇది కాకుండా.. భారత క్రికెటర్లు ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు పొందారు. అయితే బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ క్రికెటర్ల కంటే బాలీవుడ్ స్టార్లు చాలా వెనుకబడి ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని బాలీవుడ్ ప్రముఖులను అధిగమించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్‌కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్‌కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర…