Telangana: వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.2,747 కోట్లు విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆధార్ , రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాల సమస్యలు పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.10 ఏళ్లలో రైతుల కోసం, వ్యవసాయం కోసం బీఆర్‌ఎస్ చేసింది ఏమి లేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇది అతిపెద్ద పండగ అని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అదేమైపోయిందో మనం చూశామన్నారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టులు నిర్మించకపోగా.. పాలమూరును ఎడారిగా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా తెలంగాణలో మా హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు.
Read Also: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
10 ఏళ్ల పాటు లక్ష రుణమాఫీ చేస్తామని నాలుగు దఫాల్లో కూడా చేయలేకపోయారన్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ వడ్డీ పెరిగిపోయిందని పేర్కొ్న్నారు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే 18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీ చేయకుండా మీలాగా తప్పించుకుని పోలేదని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఎవరూ చేయలేదన్నారు. ఏడాది కాకముందే వేల కోట్ల రూపాయలు రైతులకు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.