నర్సాపూర్ గెలుపు బాధ్యత సీఎం కేసీఆర్ నాపైనే వేశారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం నర్సాపూర్కి రావడం అదృష్టమన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పకుంటే.. ఆయన పర్యటనలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా..? అని ప్రశ్నించారు.
చట్టసభల్లో స్థానమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో నూర్ బాషా దూదేకుల సింహగర్జన కార్యక్రమం జరుగుతోంది. వైసీపీ యువనేత జాన్ సైదా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు. ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ లేఖల్లో పేర్కొంది.
Telangana elections: ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వివరాల లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ మాట్లాడుతూ.. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియ చేసారు. అలానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సురేందర్ పార్టీకి ద్రోహం చేశాడు…
సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. పదేళ్లు గడిచినా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు.
మరో నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచుతూ ఉంటే.. కొందరు కీలక నేతలు తమకు పార్టీలో స్థానం దక్కడం లేదని రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.
బీసీలను కేటీఆర్ అవమానించారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
అమరావతిలోని ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఏబీవీపీ అమృతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీలో పని చేసిన ప్రస్తుత, పూర్వ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోందని అన్నారు. గౌహతిలో జరిగిన తొలి జాతీయ మహా సభకు హజరయ్యానని తెలిపారు.