తెలంగాణలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు నిజమవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రసంగించారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ఏ టీం, బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు.
లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో భాగంగా 29వ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టీమిండియాను 229 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 101 బంతుల్లో అత్యధికంగా 87 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచారు.
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బాధగా ఉండవచ్చు అన్నారు. బాబు 13 చోట్ల సంతకాలు చేసారని.. స్కిల్ స్కాం రెడ్ హ్యాండెడ్ క్రైం అని తెలిపారు. చంద్రబాబు మెదటి నుంచి స్కాంల వ్యక్తేనని సీతారాం దుయ్యబట్టారు.
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్ అని ఆనాడు అన్నారని, కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారని సీఎం గుర్తు చేశారు.
కేసీఆర్ను విమర్శించే నాయకులకు కూడా సర్కార్ పథకాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయినా కేసీఆర్ ఏమి చేసిండు అని విపక్ష నేతలు అంటారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. గత పదేళ్ళలో మసిగుండ్లపల్లి గ్రామం చాలా మారిందని.. రోడ్డు, డ్రైనేజీలతో పాటు గ్రామం అభివృద్ధి చెందిందని పార్టీ మారిన నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నట్లు మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఆనాడు గోదావరి జలాల కోసం పోరాటాలు చేసిన గడ్డ తుంగతుర్తి అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తుంగతుర్తి సస్యశ్యామలంగా మారింది... కారణం కాళేశ్వరమని సీఎం వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని కూడా త్వరలోనే అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.