సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. పదేళ్లు గడిచినా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్ దారులకు డబ్బులు ఎప్పుడు పడుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు.
Read Also: Manchu Vishnu: బిగ్ బ్రేకింగ్.. కన్నప్ప షూటింగ్ లో మంచు విష్ణుకు ప్రమాదం
పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని కిరాయి మనుషులతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. సీఎం కేసీఆర్ కు తాను సూటిగా సవాల్ విసురుతున్నానని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. బస్సు సిద్ధంగా ఉంది.. గజ్వేల్ ఫామ్ హౌస్ కు రావాలా.. ప్రగతి భవన్ కు రావాలో చెప్పండి అని నిలదీశారు.
Read Also: CM KCR: బీఆర్‌ఎస్సే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్ధే లక్ష్యం
మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకుని అటునుంచి కర్ణాటక వెళదామని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాలుకు మీరు సిద్ధమా? అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.