Home
Telugu News
Telugu News News
-
Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రహస్యం బయటపెట్టిన కొడుకు
యూపీలోని షాజహాన్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో పగులగొట్టి హత్య చేసింది. అనంతరం.. భర్త మృతదేహంపై ఇటుకలను పడేశారు. ఉదయం తన తల్లి ఇంటికి వెళ్లిన భార్య రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పింది. మృతదేహంపై తల తప్ప మరెక్కడా గాయాలు లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. -
Indigo Flight: ఢిల్లీ నుంచి సౌదీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న ఇండిగో విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడి ఆరోగ్యం క్షీణించింది. -
LK Advani: ఎల్కే అద్వానీ హెల్త్ బులెటిన్ విడుదల..
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను అపోలో హస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా.. ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరో మైలురాయి సాధించాడు. శుక్రవారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను బాబర్ ఆజం వెనక్కి నెట్టాడు. టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించాడు. ఆజం.. 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించాడు. బాబర్‌కు ముందు.. 314 ఇన్నింగ్స్‌లలో ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ గేల్ అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.… -
Ulefone Tab W10: పెద్ద డిస్ప్లే.. 6600mAh బ్యాటరీతో సరికొత్త ట్యాబ్.. నాన్ స్టాప్ వీడియోలు
Ulefone తన సరికొత్త టాబ్లెట్ Ulefone Tab W10ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్ ఆకర్షణీయమైన డిజైన్.. శక్తివంతమైన పనితీరు, అధిక ఫీచర్లను కలిగి ఉంది. సాధారణ వినియోగదారులు, నిపుణులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ట్యాబ్‌లో 10 అంగుళాల డిస్ప్లే, హెవీ ర్యామ్‌తో పాటు 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ ఉంది. అలాగే.. 6600mAh బ్యాటరీని కలిగి ఉంది. -
Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారంటే..?
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది. -
IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు. -
Crime News: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్, 8 మంది అరెస్ట్
అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు. -
Crime News: హషీమ్ బాబా గ్యాంగ్ షూటర్ సోనూ మట్కా ఎన్కౌంటర్..
మీరట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. -
Bihar: బీహార్‌లో మావోల దుశ్చర్య..? రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం
బీహార్‌లోని అర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి మఖమిల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని రోడ్డు రోలర్, రెండు జేసీబీలు, రెండు హైవేలు, రెండు ట్రాక్టర్లతో కూడిన ట్యాంకర్లను తగులబెట్టారు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!