పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా సీఎం జగన్ భావిస్తారని తెలిపారు. అలాంటి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత అణగారిన వర్గాలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
ఎల్బీనగర్ కాషాయమయంగా మారింది. భారీ జన సంద్రంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు హయత్ నగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజాసింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ శ్రేణులు, మిత్ర పక్షం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.
ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. రూ.149 కోట్లతో అమరావతి - బెల్లంకొండ రోడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ హయాంలో సదావర్తి భూములు కాజేయాలని చూసారని... అమరావతి దేవుడి సాక్షిగా ఆ భూములను కాపాడానన్నారు. అంతేకాకుండా.. అచ్చంపేట మండలం సత్తెమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. అటవీ శాఖ అనుమతులు తెచ్చి రోడ్ వేస్తున్నామని తెలిపారు
సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.
ఎమ్మెల్యేలను రేవంత్ కొనాలి అని చూశాడు అని కేసీఆర్ అంటున్నాడని, కొనుగోళ్ల మీద చర్చ కు సిద్ధమా అని సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 42 మంది ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను కొన్నది కేసీఆర్ అని ఆయన విమర్శించారు. breaking news, latest news, telugu news, reavnth reddy, cm kcr, big news, congress, telangna elections 2023
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం రాలేదు.. పెద్దపాడులో ఓటు అడగనన్నారు. మీకు ఇష్టం ఉంటే వేయండి... అలాగని మీ పనులు ఆపనని మంత్రి ధర్మాన తెలిపారు. నన్ను కాదని మీరు ఓటు వేస్తారా... మే వరకూ నేను ఉంటాను వేయండి చూద్దాం అని అక్కడి జనాలను ఉద్దేశించి అన్నారు.
కామారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్ విజయభేరి యాత్ర - బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరికి వాళ్లు సీఎం అంటారు ఏంది..? ఇది తప్పు.. breaking news, latest news, telugu news, big news, v hanumantha rao
దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. చట్ట అమలుకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుండి 10 గంటల వరకు క్రాకర్లు పేల్చాలని నోటీసుల్లో తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని కోరారు. దీని వల్ల వాయు, శబ్ద కాలుష్యం…