Pithani Satyanarayana: సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. వైసీపీ అరాచక పరిపాలనలో ప్రజలు విసుగు చెందారని పితాని దుయ్యబట్టారు. తమ ప్రచారం కోసం ప్రజాధనం వాడటం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ డబ్బుపై ఆశతో సీఎం అయ్యాక వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్‌గా యడియూరప్ప కుమారుడు..
మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు కావాలో ప్రజలు ప్రశ్నించాలని పితాని సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక, సారా, మైన్స్ దోపిడీ చేస్తున్నారని తెలిపారు. జగన్ తన అవినీతి గురించి మాట్లాడే వారిని జైలులో పెట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చీప్ లిక్కర్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. కుర్చీలు కూడా లేకుండా కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. సబ్ ప్లాన్ చట్టం ఎత్తేసి ఎస్సీలను మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకుని దాచుకునే ముఖ్యమంత్రి జగన్ అని పితాని సత్యనారాయణ అన్నారు.
Read Also: Minister Dharmana: ఓటు అడగను, మీకు ఇష్టం ఉంటే వేయండి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు