పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా సీఎం జగన్ భావిస్తారని తెలిపారు. అలాంటి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత అణగారిన వర్గాలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. మహిషాసురుని సంహరిస్తే దసరా చేసుకుంటాం… నరకాసురుని వదిస్తే దీపావళి చేస్తాం… తరతరాల అణచి వేతను సంహరిస్తే చేసేదే సామాజిక సాధికార యాత్ర అని పేర్కొన్నారు. అమ్మఒడి, జగనన్న గోరు ముద్ద, విద్యా కానుకలు ఇస్తున్నామని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. మూడు వేలకు పైగా వ్యాధులకు ఆరోగ్య శ్రీ వర్తింప చేశామని మంత్రి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నామని మంత్రి విడదల రజనీ తెలిపారు.
Read Also: Sama Ranga Reddy: కాషాయమయమైన ఎల్బీనగర్.. భారీ జన సంద్రం నడుమ నామినేషన్
మరోవైపు వైసీపీ నేత అలీ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ బిడ్డని అని గర్వంగా చెప్తున్నా.. నేను చదువుకుంది తక్కువే అయినా, ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడగలనని అన్నారు. పేద వారికి కష్టం వచ్చింది అంటే కులం, పార్టీ చూడకుండా సాయం చేసే నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. అదే దారిలో నడుస్తున్న నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవాలి అని ఆలోచించే నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. నవరత్నాలతో పేదల కష్టాలు తీర్చారని అలీ తెలిపారు.
Read Also: MLA Shankar Rao: నా మీద పోటీకి టీడీపీ నాయకులను వెతుక్కుంటుంది